హైదరాబాద్

పగలు భగభగ రాత్రి గజగజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, ఖైరతాబాద్, మార్చి 5: నగర ప్రజలతో వాతావరణం దోబూచులాడుతోంది. భిన్న వాతావరణంలో విభిన్న ఉష్ణోగ్రతలు నగర ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. పగలు ప్రచండ భానుడి భగభగలతో అల్లాడుతున్న జనం రాత్రి చల్లటి గాలులతో కూడిన చలితో గజగజ వణుకుతున్నారు. వారం నుంచి నగరంలో నెలకొన్న భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు వింత అనుభవాన్ని ఎదుర్కొంటున్నారు. రాత్రి, పగలు వేళలలో ఉష్ణోగ్రతల వ్యత్యాసం నెలకొంది. పగటిపూట నగరంలో సాదారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితి దృష్ట్యా నగరంలో ప్రస్తుతం పగలు నమోదౌతున్న 38 డిగ్రీల ఉష్ణోగ్రత తెల్లవారుజాముకి 15 డిగ్రీలకు పడిపోతుండటం గమనార్హం. ఆకాశం నిర్మలంగా ఉండటంతో పాటు చలికాలానికి వేసవికి ఇది సంధికాలం కావడంతో ఈ విభిన్న పరిస్థితులు నెలకొన్నాయని వాతావరణ శాఖ పేర్కొంటుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఈ చిత్రమైన వాతావరణ పరిస్థితితులతో ప్రజల్లో ఆరోగ్య రుగ్మతలు తలెత్తుతున్నాయి. జలుబు, చలిజ్వరం, శ్వాసకోశ వ్యాధులు, తలనొప్పి ప్రభలుతున్నాయి.