హైదరాబాద్

ఆర్టీసి బస్సుల్లో చిల్లర లొల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ముషీరాబాద్, మార్చి 5: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్న చందంగా మారింది ఆర్టీసి బస్సుల్లోని చిల్లర తగాదా వ్యవహారం. టికెట్‌కు సరిపడ చిల్లర ఇవ్వాలని కండక్టర్లు, ఉంటే ఇస్తాం కానీ చిల్లర తమ వద్ద ఎక్కడిదంటూ ప్రయాణికుల మధ్య తరుచూ వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆర్టీసి డిపోల నుంచి బయల్దేరే బస్సు మొదటి ట్రిప్పు కన్నా ముందు అక్కడి క్యాష్ కౌంటర్ నుంచి కేవలం రూ. 150 మాత్రమే ఒక్కో కండక్టర్‌కు చిల్లర ఇస్తున్నారు. కనీస టికెట్ ధర ఆర్డినరీ బస్సుల్లో ఏడు రూపాయలుండగా, మెట్రో, సూపర్‌లగ్జరీ, ఏసి బస్సుల్లో ఛార్జీల్లో వ్యత్యాసాలుంటున్నాయి. కనీసం పది రూపాయలిచ్చి టికెట్ తీసుకునే ప్రయాణికుడికి మూడు రూపాయల చిల్లర కండక్టర్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఒక స్టేజు నుంచి మరో స్టేజ్‌కు ప్రయాణించాలన్నా, ప్రయాణికుడు రూ. ఏడు చెల్లించాల్సిందే! ఈ క్రమంలో అపుడపుడు బస్సు ప్రయాణం చేసే చాలా తక్కువ మంది ప్రయాణికులు కండక్టర్ టికెట్ అనగానే రూ. 50, వంద నోట్లు ఇస్తున్నారు. దీంతో సరైన చిల్లర చెల్లించాలని కండక్టర్లు సూచించటంతో తమ వద్ద చిల్లర ఎందుకు ఉంటుందని వారు తిరిగి ప్రశ్నించటంతో, చిల్లర ఉంటేనే ప్రయాణించాలని, లేని పక్షంలో బస్సు దిగాలని సూచించటంతో ప్రయాణికులు ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఓ వైపు ఎక్కడ చెకింగ్ బృందం వస్తుందోనన్న ఆత్రుతలో ఉండే కండక్టర్లు, ఈ వాగ్వావిదాలతో మిగిలిన ప్రయాణికులకు సకాలంలో టికెట్లు ఇవ్వలేకపోతున్నారు. దీంతో మిగిత ప్రయాణికులు కూడా కండక్టర్లపైనే ఆగ్రహం వ్యక్తం చేయటంతో పలు సందర్భాల్లో కండక్టర్లు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళా కండక్టర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత నవంబర్ 8వ తేదీన కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన తర్వాత తలెత్తిన చిల్లర కొరత నుంచి ఇపుడిపుడే కోలుకుంటున్న తరుణంలో ఒకటి, రెండు, అయిదు రూపాయల నాణేల కొరతతో ఆర్టీసి బస్సుల్లో ఈ చిల్లర తగాదాలు చోటుచేసుకుంటున్నాయి. మామూలుగానే మహిళ కండక్టర్లను వెకిలి చేష్టలతో హేళన చేసే ఆకతాయిలు ఈ చిల్లర సమస్యను సాకుగా తీసుకుని మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
కండక్టర్లకు సరిపడా చిల్లర ఇవ్వాలి
నగరంలోని ఆయా ఆర్టీసి బస్సు డిపోల్లో నుంచి బయల్దేరే బస్సు మొదటి ట్రిప్పులో మాత్రమే కౌంటర్ నుంచి కండక్టర్లకు చిల్లర ఇవ్వటం ఆనవాయితీగా వస్తుంది. కానీ కేవలం రూ. 150 మాత్రమే వారికి చిల్లర ఇస్తుండటంతో అది ఏ మూలకు సరిపోవటం లేదు. ప్రయాణికులు, కండక్టర్ల మధ్య జరిగే చిల్లర లొల్లి నియంత్రించాలంటే ఆర్టీసి యాజమాన్యం రిజర్వు బ్యాంకుతో సమన్వయం చేసుకుని ఒక్కో బస్సు రాకపోకలు, అందులో ప్రయాణించే ప్రయాణికుల అంచనా మేరకు చిల్లరను సమకూర్చుకోవాలని ప్రయాణికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.