హైదరాబాద్

11న మేయర్ ఎన్నిక ఇంకా తేలని అభ్యర్థిత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా పర్యవేక్షణలో ఈ ఎన్నికలు జరుగుతాయి. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్న తెరాస పార్టీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఈ నెల 11న జరిగే జిహెచ్‌ఎంసి సర్వసభ్య సమావేశంలో కొత్తగా గెలిచిన 150 మంది కార్పొరేటర్లు, 67 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు) పాల్గొని మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకుంటారు. అదే రోజు ఉదయం తెరాస తన అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.