హైదరాబాద్

‘ఉగ్ర’మూలాలను కనిపెట్టడంలో తెలంగాణ పోలీస్ దిట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 9: దేశవ్యాప్తంగా జరుగుతోన్న ‘ఉగ్ర’దాడులను కనిపెట్టడంలో తెలంగాణ పోలీస్ పాత్ర అనివార్యమనిపిస్తోంది. ఇటీవలి కాలం నుంచి ఎక్కడ ఉగ్రదాడి జరిగినా..సానుభూతిపరులు పట్టుబడినా.. ఎన్‌ఐఏకు తెలంగాణ పోలీస్ సహకారం అందిస్తోంది. 2015 జనవరి నుంచి ఈ నెల 7వ, తేదీ వరకు లక్నోలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన సైఫుల్లా ఖాన్ సహ పోలీసులు అదుపులోకి తీసుకున్న మరో ఉగ్రవాది వరకు తెలంగాణ పోలీసులు అందించిన సమాచారం మేరకే ఎన్‌ఐఏ సక్సెస్ అవుతోంది. గత నాలుగేళ్లుగా తెలంగాణలో పట్టుబడిన 23 మంది ఐసిస్, ఇస్లామిక్ స్టూడెంట్స్ మూవ్‌మెంట్ సానుభూతిపరుల ఇంటరాగేషన్‌లో హైదరాబాద్ పోలీసులే కీలక పాత్ర వహించారు. తెలంగాణ పోలీసులు ఆధునిక టెక్నాలజీని వినియోగించి దేశంలో ఐసిస్, ఇస్లామిక్ స్టూడెంట్ మూవ్‌మెంట్, జిహాదీ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థల మూలాలను కనిపెట్టారు. 2015లో నల్గొండ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు సిమి కార్యకర్తల మృతి, ఐసిస్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు పోలీస్ అధికారులు హతమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర శివారులోని పహాడి షరీఫ్‌లో షెల్టర్ తీసుకుని, కాల్పుల శిక్షణ పొందిన ఆరుగురు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల అరెస్టు, బేగంపేట్‌లో టైలర్ వృత్తిలో కొనసాగిస్తూ పట్టుబడిన ఉగ్రవాది అబుబాకర్ ఖాజా, పహాడిషరీఫ్‌లో వైద్యుడిగా కొనసాగుతూ ఉగ్రవాద కార్యకలాపాలు సాగించిన తాజ్ సాదత్ (గుజరాత్) అరెస్టు, కాశ్మీర్ నుంచి సిరియా వెళ్లేందుకు యత్నించిన ఆరుగురు హైదరాబాద్ యువకులు పుణెలో పట్టుబడ్డ సంఘటనలు వంటి సమాచారాన్ని రాబట్టి వారి అరెస్టులకు దోహదపడింది తెలంగాణ పోలీసులే. బెంగుళూరులోనూ ఓ ఉగ్ర స్థావరంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగా సాగిన ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టింది.. దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ఘటనలో నిందితులను గుర్తించి, శిక్షపడే వరకూ తెలంగాణ పోలీసులు ప్రధాన పాత్రను పోషించారు. ఈ మేరకు ఉగ్రకార్యకలాపాలకు చెక్ పెట్టడంలోనూ దిట్ట అనిపించుకున్న తెలంగాణ పోలీసుల కేంద్ర హోంశాఖ ప్రశంసించింది.
తాజాగా బుధవారం ఉత్తరప్రదేశ్ లక్నోలో జరిగిన ఎన్‌కౌంటర్, పోలీసులు అదుపులో తీసుకున్న ఓ యువకుడి కీలక సమాచారం అందించింది కూడా తెలంగాణ పోలీసులేనని తెలిసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ పోలీస్‌లకు ఎన్‌ఐఏ ద్వారా తెలంగాణ పోలీసులు అందించిన సమాచారమేనని సమాచారం.

ఓయు శతాబ్ది ఉత్సవాలను
ఘనంగా నిర్వహించాలి
నాచారం, మార్చి 9: ఓయు శతాబ్ది ఉత్సవాలను పూర్వ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, నాన్‌టీచింగ్, టీచింగ్ సిబ్బంది ఘనంగా నిర్వహించి ఓయు ఘనతను ప్రపంచానికి చాటాలని శతాబ్ది ఉత్సవ కమిటీ కన్వీనర్ ఎస్ లింబాద్రి సూచించారు. విసి చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఓయు సెంటినరీ ఉత్సవాలకు ప్రపంచ దేశాల నుండి ఎంతోమంది విద్యావేత్తలు వస్తున్నారని తెలిపారు. ఉత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం 412కోట్ల నిధుల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని అందుకు 20కోట్ల నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఉత్సవాలకు ఎన్‌సిసి నుండి సుమారు 5000 మంది రన్‌లో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు స్టీఫెన్‌సన్, రాజు, విష్ణుదేవ్ పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో
సిల్క్‌మార్క్ పోటీలు
హైదరాబాద్, మార్చి 9: మహిళల్లో దాగివున్న నైపుణ్యన్ని, ప్రతిభను వెలికితీయడం కోసం వరుసగా నాలుగవ సారి సిల్క్ మార్క్ ఫైనల్ పోటీలను గురువారం రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ పోటీలు సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ సిల్క్ బోర్డు, జౌళీ మంత్రిత్వ శాఖల సౌజన్యంతో నిర్వహించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ పోటీల్లో శ్రీమతి సిల్క్‌మార్క్ క్రౌన్‌ను అనిరిత్‌కౌర్, కావేరి, పల్లవిజోషీ గెల్చుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ కార్యదర్శి బుర్రవెంకటేశం, నృత్యకళాకారిణి దీపికారెడ్డి గౌరవ అతిధులుగా పాల్గొని గెలుపొందిన వారిని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సిల్క్‌మార్క్ ఆర్గనైజేషన్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ గోపాల్ కూడా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని బుల్లితెర నిర్మాత దర్శకుడు మహ్మద్ షరీఫ్ నిర్వహించారు.