హైదరాబాద్

ఆర్టీసి యాజమాన్యానికి అల్టిమేటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, నేటి బడ్జెట్‌లో ఆర్టీసికి వెయ్యి కోట్లు కేటాయించాలని లేనిపక్షంలో ఈ నెల 15 నుంచి 36 గంటల నిరవధిక దీక్షను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసి ఎంప్లారుూస్ యూనియన్ హెచ్చరించింది. శనివారం గ్రేటర్ హైదరాబాద్ జోనల్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంప్లారుూస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె రాజిరెడ్డి మాట్లాడుతూ, 2015 మే 13న జరిగిన వేతన సవరణ సమయంలో సిఎం కెసిఆర్ ఆర్టీసి కార్మికులకు ఇచ్చిన హామీని విస్మరించారని, 2016 బడ్జెట్‌లో ఆర్టీసికి వెయ్యి కోట్లు కేటాయించడంలో విఫలమయ్యారని ఆయన నిశితంగా విమర్శించారు. 2017 బడ్జెట్‌లోనైనా ఆర్టీసికి వెయ్యి కోట్లు కేటాయించాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అద్దె బస్సులు రావనుకుంటే ప్రభుత్వం 14 వందలకు పైగా అద్దె బస్సులను తీసుకుని దొంగ చాటుగా నడిపిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు బస్సులను అడ్డుకోకుండా తెలంగాణలో ఆరెంజ్ బస్సుల రూపంలో విస్తరిస్తున్న అక్రమ రవాణాను పెంచిపోషిస్తుందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆర్టీసికి ఉన్న సుమారు రెండువేల కోట్ల అప్పులను రైట్ ఆఫ్ చేయాలని, ఆర్టీసి ప్రొవిజనల్ బైఫర్‌కేషన్ అయినందున వెంటనే ఫైనల్ భైఫర్‌కేషన్ జరపాలని, రెండు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య ఇంటర్‌స్టేట్ అగ్రిమెంట్ అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలని రాజిరెడ్డి డిమాండ్ చేశారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

హైదరాబాద్, మార్చి 11: రంగారెడ్డి జిల్లాలో శనివారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. నందిగామ మండల పరిధిలోని ధన్‌సింగ్ తండా జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనగా అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు బీహార్‌కు చెందిన ఉపెందర్‌గా గుర్తించారు. మరో సంఘటన హయత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కోహెడ వద్ద ఓ బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో పక్కనే ఉన్న సైకిలిస్ట్ యాదగిరి (26) అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.