హైదరాబాద్

కరెంటు కట్..కట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 11: క్రమంగా వేసవి ఎండలు తీవ్రరూపం దాల్చటంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు కరెంటు వినియోగం పెరిగింది. ప్రజల అవసరాలకు తగిన విధంగా కరెంటు ఉత్పత్తి, సరఫరా అందుబాటులో ఉన్నా, ఒక్కసారిగా వినియోగం పెరగటంతో సాంకేతిక లోపాలు తలెత్తటంతో సరఫరాలో అంతరాయలేర్పడుతున్నాయి. ఈ వేసవిలో కూడా కరెంటు సరఫరాకు సంబంధించి ఎలాంటి కోతల్లేవని ప్రభుత్వం చెబుతున్నా, నిన్నమొన్నటి వరకు చలి ప్రభావం ఉండటంతో అంతంతమాత్రంగా ఉన్న కరెంటు వినియోగం ఇపుడు గణనీయంగా పెరగటంతో ఫ్యూజ్‌లు కాలిపోవటం వంటి సమస్యలు తలెత్తటంతో నగరంలోని వివిధ ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో కరెంటు సరఫరాలో అంతరాయలేర్పడుతున్నాయి. వాస్తవానికి సమస్య చిన్నదే అయినా దేనికీ అప్పటికపుడు స్పందించే అలవాటు లేని క్షేత్ర స్థాయి సిబ్బంది అలసత్వం కారణంగా ఫ్యూజ్‌లను సకాలంలో పునరుద్దరించకపోవటం వల్ల ఎక్కువ సేపు కరెంటు సరఫరా నిల్చిపోతోంది. కొన్నిసార్లు ఎక్కువ వోల్టేజీతో కరెంటు సరఫరా జరగటంతో ఇంట్లోని గృహోపకరణాలకు ముప్పు కూడా పొంచి ఉంది. ముఖ్యంగా స్టెబిలైజర్లు లేని టీవిలు, విలువైన డివిడి ప్లేయర్లు, ఫ్రిజ్ వంటి ఇతరత్ర ఎలక్ట్రానిక్ పరికరాలు ఈ రకమైన సరఫరాలో అంతరాయల వల్ల ఎపుడు మరమ్మతుల పాలవుతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, మరికొన్ని చోట్ల పట్టపగలు వీది ధీపాలు వెలుగుతుండగా, మరికొన్ని రద్దీ ప్రాంతాల్లో చీకటి పడిన తర్వాత కూడా లైట్లు వెలగటం లేదు. ఇప్పటికే కరెంటును ఆదా చేస్తున్నామని చెప్పుకుంటున్న జిహెచ్‌ఎంసి అధికారులు వీటికి మర్మతులు చేయటంలో అలసత్వంగా వ్యవహారిస్తున్నారు. నగరంలోని మొత్తం వీది ధీపాల స్థానంలో ఎల్‌ఇడి లైట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో వీది ధీపాల్లోని ఫ్రేమ్‌లోపలి బల్బులు కాలిపోయినా వాటిని మార్చటం లేదన్న వాదనలున్నాయి.