హైదరాబాద్

నేటి నుంచి టెన్త్ పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండటంతో ఉదయానే్న పిల్లలతో కలిసి పరీక్షా కేంద్రాలకు పరుగులు పెడుతున్న తల్లిదండ్రులు మంగళవారం నుంచి టెన్త్ పరీక్షలకు సిద్దం కావాలి. మంగళవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నందున విస్త్రృత ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ తెలిపారు. తొలి రెండు రోజులైన 14, 15వ తేదీల్లో వోఎస్‌ఎస్ అభ్యర్థులకు, అలాగే 16న వొకేషనల్ అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించిన తర్వాత 17 నుంచి రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ పరీక్షలు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం పనె్నండు గంటల 15 నిమిషాల వరకు జరుగుతాయని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ జిల్లాలో రెగ్యులర్ పరీక్షల కోసం 297, ప్రైవేటు పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్న 38తో కలిపి మొత్తం 335 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, ఈ నెల 30వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల కేంద్రాల్లో వౌలిక వసతుల కల్పిన వంటివి పూర్తయినట్లు ఆయన వెల్లడించారు.
మొత్తం కేంద్రాల్లో ఈ సారి 73వేల 796 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన వివరించారు. వీరిలో 66 వేల 164 మంది విద్యార్థులు రెగ్యులర్ కాగా, 7632 మంది విద్యార్థులు ప్రైవేటుగా ఈ పరీక్షలకు హజరవుతున్నట్లు ఆయన తెలిపారు. పకడ్బందీగా, పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు 335 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, మరో 335 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను, 72 మంది కస్టోడియన్లను నియమించినట్లు ఆయన తెలిపారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా, విద్యార్థులు మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఎప్పటికపుడు పర్యవేక్షించేందుకు గాను 3074 మంది ఇన్విజిలేటర్లను, అలాగే మరో 72 మంది అధికారులతో ఫ్లెయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయటం జరిగిందని వివరించారు. 36 పోలీస్ స్టేషన్లను స్టోరేజీ పాయింట్లుగా వినియోగించుకుంటూ ప్రశ్నపత్రాలను భద్రపర్చనున్నట్లు తెలిపారు.
మొత్తం 181 సున్నితమైన పరీక్షా కేంద్రాల్లో పరీక్ష జరుగుతున్న తీరును పర్యవేక్షించేందుకు సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్షలకు హజరయ్యే విద్యార్థులు అరగంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 9 గంటల 35 నిమిషాలు దాటిన తర్వాత హాల్‌లోకి అనుమతించేది లేదని ఆయన తెల్చి చెప్పారు. అభ్యర్థులు తమ వెంట క్యాలికులేటర్లు, సెల్‌పోన్లు, ట్యాబ్‌లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాడ్జట్లను తీసుకురావద్దని డిఇవో రమేష్ సూచించారు.