హైదరాబాద్

మళ్లీ కరెన్సీ కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 15: మహానగరంలో ఏ ఏటిఎంకు వెళ్లినా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రభుత్వోద్యోగులతో పాటు చాలా వరకు ప్రైవేటు ఉద్యోగులకు కూడా ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జీతాలు ఖాతాల్లో పడ్డాయి. బ్యాంకుల్లో నగదు కొరత, సకాలంలో ఏటిఎంలలో నగదు పెట్టడంలో వహిస్తున్న అలసత్వం కారణంగా ఏటిఎంలలో నగదు అందుబాటులో లేదు. దీంతో ఖాతాదారులు బేజారవుతున్నారు. ఒకటో తేదీ తర్వాత జీతాలు ఖాతాల్లో జమ అయినా తమ అవసరాలకు అనుగుణంగా డ్రా చేసుకోలేకపోతున్నామని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. అయితే ఆర్థిక సంవత్సరం చివరి రోజులు కావటం వల్లే నగదు తగినంత అందుబాటులో లేదని కొందరు వాదిస్తుండగా, బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ డబ్బు తమ అవసరాలకు అందటం లేదని మరికొందరు వాదిస్తున్నారు. తమ ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డ్రా చేసుకునేందుకు ఖాతాదారులు బ్యాంకు వెళ్లినా, అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. యాభై వేలను డ్రా చేసుకునేందుకు వచ్చిన ఖాతాదారులకు కొన్ని బ్యాంకులు టోకెన్లు ఇచ్చి, నగదు తీసుకునేందుకు పనె్నండున్నర, ఒంటి గంటల సమయంలో రావాలని సూచిస్తున్నారు. అయితే తమకు మెడికల్ పరంగా అత్యవసరంగా నగదు అవసరమైందని కొందరు ఖాతాదారులు బ్యాంకు అధికారులతో వాదనకు దిగిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం కోఠిలో రెచ్చిపోయిన ఓ ఖాతాదారుడు ఏటిఎం అద్దాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే! ఈ ఘటనలో నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని 24గంటల గడవకముందే సుల్తాన్‌బజార్‌లో మంగళవారం రాత్రి మరో యువకుడు ఓ ఏటిఎం అద్దాలను ధ్వంసం చేశాడు. ఈ క్రమంలో సేవింగ్, కరెంటు అకౌంట్లకు సంబంధించి మినిమమ్ బ్యాలెన్స్‌పై కేంద్రం విధించిన షరతులు, విధిస్తున్న ఛార్జీలపై ఖాతాదారులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.