హైదరాబాద్

కోడలిపై మామ అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ సైదాబాద్, మార్చి 15: హైదరాబాద్ పాతబస్తీలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వావివరసలు మరచి లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. కంచన్‌బాగ్‌లో జరిగిన ఘటన మరువకముందే.. బుధవారం తాజాగా సంతోష్‌నగర్‌లో మరో ఘటన చోటుచేసుకుంది. కన్నకూతురిలా చూసుకోవాల్సిన కోడలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఆమె చిన మామ (మామ సోదరుడు). వివరాల్లోకి వెళ్తే.. సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోయిన్‌బాగ్‌కు చెందిన బాధితురాలితో ఈదీ బజార్‌కు చెందిన ముజామ్మిల్‌తో 2016 సెప్టెంబర్ 9న వివాహమైంది. కాగా ముజామ్మిల్ తనకు పిల్లలు కావడం లేదని, తన చిన నాన్నతో లైంగిక సంబంధాలు పెట్టుకోవాలంటూ భార్యను వేధించసాగాడు. దీంతో చినమామ తరచూ తనతో శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ లైంగికంగా వేధించే వాడు. ఈ నేపథ్యంలోనే చినమామ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని వారం రోజుల క్రితం తన తల్లిదండ్రులతో కలసి సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా అక్కడి పోలీసులు పట్టించుకోలేదని ఆమె బుధవారం మీడియా ముందు బోరుమని విలపించింది. తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణను కలసి వేడుకొంది. దీంతో విచారణ జరిపి కేసు నమోదు చేయాల్సిందిగా డిసిపి సంతోష్‌నగర్ పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్టు సంతోష్‌నగర్ ఇన్స్‌పెక్టర్ శంకర్ తెలిపారు.