హైదరాబాద్

అంచనాలు తారుమారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16: మహానగరంలోని కోటి జనాభాకు పౌరసేవల నిర్వాహణ, అవసరానికి తగిన విధంగా అభివృద్ధి పనులను చేపట్టే జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లకు సంబంధించి ఈ ఏటా అధికారుల అంఛనాలు తారుమారయ్యే పరిస్థితులున్నాయి. గత సంవత్సరం వెయ్యి కోట్లను అధిగమించిన వసూళ్లు ఈ సారి అధికారుల లక్ష్యానికి తగిన విధంగా వసూలయ్యేలా లేవు. ఇందుకు ముఖ్యంగా క్షేత్ర స్థాయిలో చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తూ కార్పొరేషన్ ఖజానా నింపాల్సిన ట్యాక్సు సిబ్బంది చేతివాటం ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఇటీవలే జిహెచ్‌ఎంసి ఉన్నతాధికారులు ఆస్తిపన్ను వసూళ్లను మెరుగుపర్చుకునేందుకు సెల్ఫ్ అసెస్‌మెంట్‌ను అందుబాటులోకి తెచ్చినా, క్షేత్ర స్థాయి తనిఖీలంటూ కొన్ని సర్కిళ్లలో ట్యాక్సు సిబ్బంది, బిల్ కలెక్టర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. వర్తమాన ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు సుమారు రూ. 953 కోట్ల వరకు పన్ను వసూలు కాగా, గత సంవత్సరంతో పోల్చితే వంద కోట్లు అధికంగా వసూలు చేశామని చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి గత నవంబర్ 8వ తేదీన కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా పాత నోట్లతో పన్ను చెల్లింపులు స్వీకరించిన బల్దియాకు అప్పట్లోనే రూ. 371 కోట్ల వరకు పన్ను వసూలైంది. ప్రతిసంవత్సరం సక్రమంగా పన్నులు చెల్లించే వారే తమవద్దనున్న పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకులు చుట్టూ ప్రదక్షిణలు చేసే ఇష్టంలేకనే తమవద్దనున్న పాత నోట్లతో పన్ను చెల్లించినందున మార్చి మాసంలో వసూళ్లు తగ్గాయని చెప్పవచ్చు. ప్రతి ఆర్థిక సంవత్సరం మార్చి మాసంలో రికార్డు స్థాయిలో పన్ను వసూలు కాగా, ఈ సారి మార్చి ఇప్పటికే పదిహేను రోజులు గడిపోగా, కేవలం రూ. 53 కోట్ల మాత్రమే వసూలయ్యాయి. ఆర్థిక సంవత్సరం ముగింపుకు ఇంకా కేవలం పక్షం రోజుల సమయం మాత్రమే ఉన్నా, అధికారులు లక్ష్యంగా పెట్టుకున్న రూ. 1250 కోట్లను అధిగమించాలంటే మరో రూ. 300 కోట్లను వసూలు చేయాల్సి ఉంది. ముఖ్యంగా నేటికీ అసెస్‌మెంట్ కాకుండా ఆస్తిపన్ను చెల్లింపుల పరిధిలోకి రాని ఆస్తులను గుర్తించి, వాటికి కూడా పన్ను వర్తింపజేయాలంటూ ఉన్నతాధికారుల ఆదేశాలు క్షేత్ర స్థాయి సిబ్బందికి వరంగా మారింది. కొన్ని సర్కిళ్లలో స్వచ్ఛందంగా ముందుకొచ్చి అసెస్‌మెంట్ చేయించుకునే వారికి రెండేళ్ల పన్నును విధిస్తూ వసూళ్లు చేస్తుండగా, మరికొన్ని సర్కిళ్లలో ఏకంగా పదేళ్ల నుంచి పన్నును వడ్డిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే పలు సార్లు విపక్షాలు జిహెచ్‌ఎంసి కార్యాలయం ముందు ఆందోళనకు దిగినా, పలువురు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించినా, నేటికీ వసూళ్లు యదేచ్చగా కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ట్యాక్సు సిబ్బంది కమర్షియల్ భవనాలను తమ రికార్డుల్లో రెసిడెన్షియల్‌గా చూపుతూ సొమ్ము చేసుకుంటున్నారు.
జియాగూడలో ఆధునిక కబేళా నిర్మిస్తాం

వ్యాపారులతో
సమావేశమైన మేయర్

హైదరాబాద్, మార్చి 16: జియాగూడ కబేళా స్థలంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్లాటర్ హౌజ్‌ను నిర్మించనున్నట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వెల్లడించారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డితో కలిసి ఆయన గురువారం సాయంత్రం స్లాటర్ హౌజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వారితో మేయర్ చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతిరోజు ఆరు వేల పై చిలుకు గొర్రెలు, మేకలను ఇక్కడ స్లాటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. మ్యానువల్‌గా స్లాటరింగ్ జరగటంతో సౌకర్యాలేమీ లేకపోవటంతో అపరిశుభ్రమైనే వాతావరణంలో వ్యాపారాలు కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. దేశంలోనే అతిపెద్ద స్లాటర్ హౌజ్‌లలో ఒకటి అయిన జియాగూడపై దాదాపు పదివేల మంది చిన్నాచితక వ్యాపారులు ఆధారపడి ఉన్నారని వివరించారు. సుమారు పదకొండు ఎకరాలకు పైగా ఉన్న ఈ జియాగూడలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అత్యంత ఆధునిక కబేళాను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని, ఇందుకు తగు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రతిపాదిత ఆధునిక స్లాటర్ హౌజ్ నమూనాను రూపొందించిన వెంటనే జియాగూడలో వ్యాపారం నిర్వహిస్తున్న వారి సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని త్వరలోనే నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆధునిక స్లాటర్ హౌజ్ నిర్మాణం సందర్భంగా స్లాటరింగ్ చేయటం, ఇతర కబేళాలలకు తరలించటం వంటి అంశాలపై వారి అభిప్రాయాలను, సూచనలను స్వీకరించి, వాటి మేరకే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ అంశంపై వారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నామని వివరించారు. నగరానిక దాదాపు 70 శాతం మాంసం ఈ స్లాటర్ హౌజ్ నుంచే సరఫరా అవుతుందని, దీన్ని ఆధునికరిస్తున్నందున స్థానిక వ్యాపారులకు ఆదాయం పెరగటంతో ఆపటు నగరవాసులకు నాణ్యమైన మాంసం అందించేందుకు వీలు కల్గుతుందన్నారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జియాగూడ స్లాటర్ హౌజ్‌లో ఉన్న వ్యాపారులు దీనిపై ఆధారపడే వారిపై సమగ్ర సర్వే నిర్వహించి వివరాలు సేకరిస్తామని తెలిపారు. ఇక్కడి స్థానికుల జీవనోపాధికి ఏ విధమైన భంగం కలగకుండా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ హరిచందన, ట్రాఫిక్ డిసిపి రంగనాథ్, అదనపు కమిషనర్లు రవికిరణ్, భాస్కరచారి తదితరులున్నారు.