హైదరాబాద్

పాలకుల భూములా..ప్రభుత్వ భూములా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైద్రాబాద్, మార్చి 16: పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన జిల్లాల పునర్విభజనలో చిన్నజిల్లాఅయినా పెద్దజిల్లాలోనైనా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం మారలేదు. ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలు,ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. జిల్లాల పునర్విభజన కంటే ముందు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలనే ఆలోచనతో పట్టణప్రాంతాల్లో విలువైన భూములను గుర్తించి బహిరంగ వేలానికి సిద్ధం చేసిన చిన్నచిన్న స్థలాలను సైతం ప్రస్తుతం కబ్జాదారుల పాలవుతున్నాయి. ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రభుత్వ భూముల గుర్తింపు వాటి పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా వాటిని అన్యాక్రాంతం చేసే భూకబ్జాదారులకు మాత్రంతామున్నామంటూ కొంతమంది పాలకపక్షానికి చెందిన నాయకులు వచ్చి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారంటే తెరాస ప్రభుత్వంపై ప్రజలకు ఎలాంటి అభిప్రాయం కల్పిస్తున్నారో అర్థమవుతుంది. క్రమబద్ధీకరణకు అనువైన స్థలాలను మినహాయించి మిగిలిన స్థలాలను గుర్తించినప్పటికీ వాటిలో ప్రభుత్వ సూచిక బోర్డులను ఏర్పాటు చేయడంలో నిధుల కొరత అంటూ స్థానిక అధికారులు సమాధానం ఇస్తున్నారని తెలుస్తోంది. పూర్వ రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఉప్పల్, మల్కాజిగిరి, బాలానగర్, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, ఘట్‌కేసర్, సరూర్‌నగర్, హయత్‌నగర్ మండలాల్లో అనేక చోట్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వ సూచిక బోర్డులు మాయమయ్యాయి. అక్రమ ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాధుడు కరువయ్యారన్న ఆరోపణలు సర్వత్రా వినపడుతున్నాయి. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిధుల్లో క్షేత్రస్థాయి అధికారులపై అధికార పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న ఒత్తిడి పెరిగింది. అధికారులకు ఫిర్యాదులు చేసినా ఎటువంటి ఫలితం లేదని కొందరు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం పాలకుల ఆదేశాల మేరకే ప్రభుత్వ భూముల పరిరక్షణ కొనసాగుతుందని, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అధికారులే నోరుమెదపడం లేదనే ఆరోపణలు ప్రధానంగా మేడ్చల్ జిల్లాలో వినపడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉండగానే ప్రభుత్వ స్థలాల వేలం కోసం ప్రతిపాదించిన ఖాళీ స్థలాలను అన్యాక్రాంతం చేస్తున్న వైనంపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు వెంచర్ల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ హెచ్‌ఎండిఎ అధికారులు ఎలాంటి సర్వేలు నిర్వహించకుండానే తాత్కాలిక లేఅవుట్‌లు మంజూరు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ భూముల్లో ఫ్లాట్లుగా విభజించి విక్రయించిన అనంతరం సదరు లేఅవుట్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో అధికారులకు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం అవుతుంది. ప్రజాప్రయోజనాల కోసం వినియోగించే ప్రభుత్వ స్థలాల్లో ఎలాంటి పనులు చేయరాదంటూ అధికారులకు పాలకవర్గాలే ఒత్తిడి తీసుకువస్తున్నారంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఏ మేరకు అమలవుతున్నాయో తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటుతో అరకొర సిబ్బంది ఉన్నారంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న మండల రెవెన్యూ అధికారులపై అజమాయిషీ లేకపోవడం ఒక కారణమైతే, బారులు తీసిన పైరవీకారులతో మంతనాలు జరుపుతూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న తప్పిదాలను పట్టించుకోకపోవడం మరో కారణమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ భూములపై పాలకవర్గాలకు ఉన్న అజమాయిషీ అధికారులకు లేదనే విమర్శలు వినపిస్తున్నాయి.

వర్షం

తడిసి ముద్దయిన నగరం
స్తంభించిన ట్రాఫిక్
మెట్రో కారిడార్లలో
మరింత జఠిలం

హైదరాబాద్, ఉప్పల్, మార్చి 16: పగలు ఎండలు..రాత్రికి చల్లటిగాలులు వంటి మార్పులతో నగరంలో వాతావరణం విచిత్రంగా తయారైంది. రెండు, మూడురోజులుగా చిన్న చిన్న చినుకులుగా కురిసిన వర్షం గురువారం రాత్రి ఎనిమిది గంటల తర్వా దంచికొట్టింది. ఫలితంగా నగరం తడిసి ముద్దయింది. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన గాలి దుమారంతో కురిసిన వర్షం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకవైపు ఎండలు మరొక వైపు వర్షం కురవడం అయోమయానికి దారి తీసింది. రాత్రి ఎనిమిది గంటల తర్వాత దాదాపు అరగంట సేపు వర్షం దంచికొట్టడంతో నిత్యం రద్దీగా ఉండే జంక్షన్లలో ట్రాఫిక్ భారీగా నిల్చిపోయింది. అంతేగాక, ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్న మెట్రో కారిడార్లలో ట్రాఫిక్ జాం వర్ణణాతీతం. ఇప్పటికే అమీర్‌పేట, ఖైరతాబాద్, పంజాగుట్ట, నాంపల్లి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలతో బేజారవుతున్న వాహనదారులకు వర్షంతో ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ముఖ్యంగా పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, బేగంపేట, ప్యాట్నీ చౌరస్తా, ప్యారడైజ్ చౌరస్తాతో పాటు మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిల్చిపోయింది. వర్షం కురిసినంత సేపు బేగంపేట ఫ్లై ఓవర్‌పై భారీగా వాహనాలు నిల్చిపోయాయి. వర్షంతో నగర శివారు ప్రాంతాల రహదారులు జలమయమయ్యాయి. సాయంత్రం వచ్చిన వర్షంతో శివారు బోడుప్పల్, చెంగిచర్ల, పీర్జాదిగూడ, ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, చిల్కానగర్, నాచారం, మల్లాపూర్, కుషాయిగూడ, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లో భారీగా నీరు చేరింది. వరద నీటిలో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఇంటికి వచ్చే ఉద్యోగులు, కార్మికులు వర్షంతో ఇబ్బందులెదుర్కొన్నారు.