హైదరాబాద్

ఐటి వినియోగంతో మరిన్ని మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రోజురోజుకి సరికొత్త మార్పులతో అందుబాటులోకి వస్తున్న ఐటిని సద్వినియోగం చేసుకుంటూ వినియోగదారులకు మెరుగైన సేవలందిస్తామని జలమండలి ఎండి దాన కిషోర్ అన్నారు. టెక్నాలజీ భాగస్వామ్యం అంశంపై శనివారం జలమండలిలో వర్క్‌షాప్ నిర్వహించారు. గ్రౌండ్ సెనెటరింగ్ రాడార్, జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్, మ్యాన్‌హోళ్లకు జియోట్యాగింగ్ అంశాలపై ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు, ఐటి నిపుణులు సూచనలు, సలహాలు ఇవ్వాలని ఎండి సూచించారు.
ఈ సందర్భంగా దాన కిషోర్ మాట్లాడుతూ ఐటి హట్ మొత్తం నేడు హైదరాబాద్ వైపు చూస్తోందని, అలాంటి హైదరాబాద్‌లోనే పలు దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిధి ఓఆర్‌ఆర్ గ్రామాలు, శివారు ప్రాంతాలను కలుపుకోవటంతో మరింత విస్త్రృతమవుతోందని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటే అన్ని ప్రాంతాలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించగలమని ఆయన వివిరంచారు. నాన్ రెవెన్యూ, వాటర్, మీటరింగ్, మ్యాన్ హోల్‌మిస్సింగ్, ఓవర్ ఫ్లో, బిల్డింగ్ వంటి పలు రకాల సమస్యలకు టెక్నాలజీ పరంగా పరిష్కారం వంటి అంశాలకు సంబంధించి టెక్నాలజీ పరంగా యూరప్, జర్మనీ, సింగపూర్‌కు చెందిన పలు కంపెనీలు ఈ సమస్యలకు టెక్నాలజీ పరంగా పరిష్కారం చూపిస్తామని ముందుకుచ్చోనట్లు తెలిపారు. మ్యాన్‌హోళ్లకు జియోట్యాగింగ్ చేస్తే ఎక్కడైనా మూతల్లేని మ్యాన్‌హోళ్లు ఉంటే వెంటనే సమాచారం అందేలా ఈ సిస్టమ్ దోహపడుతుందన్నారు. సాంకేతిక పరంగా లెక్కల్లోకి రాని నీటి శాతాన్ని తగ్గించటానికి టెక్నాలజీని అందుబాటులకో తీసకురావాలని ఎండి సూచించారు. బోర్డు సరఫరా చేస్తున్న నీటిలో దాదాపు 40 శాతం నీరు లెక్కల్లోకి రాకుండా పోతోందని వివరించారు. మొత్తం 9.10 లక్షల నీటి కనెక్షన్లుండగా, అందులో 26 శాతం కనెక్షన్లకు మాత్రమే పనిచేస్తున్న మీటర్లున్నట్లు వివరించారు. తక్కువ వ్యయం అయ్యే మీటర్లు భిగించి, వాటిని ట్యాంపరింగ్ చేయకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఐఐటి భువనేశ్వర్, ప్రొ.మణికందన్, ముంబై ఐఐటి ప్రొఫెసర్లు ప్రమోద్, నటరాజన్, డా. అర్ణబ్‌దాస్, హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్లు, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు తదితరులు పాల్గొన్నారు.