హైదరాబాద్

రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు చేపట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 18: రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కలెక్టర్ పాల్గొని ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోడ్డు బ్యాంకింగ్, స్పీడ్ బ్రేకర్స్ దగ్గర ఏవైనా సమస్యలుంటే సంబంధిత అధికారులు అవసరమైన మరమ్మతులు చేసి రోడ్డు ప్రయాణికులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యమైన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్స్ దగ్గర, రోడ్డు మలుపుల్లో సైన్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనివల్ల చాలావరకు రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఓఆర్‌ఆర్ ప్రాంతాల్లో ఎస్‌జిఎం బోర్డ్‌లను ప్రయాణికులకు కొంతదూరంలో నుండే కనపడే విధంగా ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఓఆర్‌ఆర్ పై ప్రమాదాలను అరికట్టేందుకు తగిన విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఓఆర్‌ఆర్ పై అత్యవసర పార్కింగ్‌కి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఓఆర్‌ఆర్ ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా మద్యం దుకాణాలను వేరే చోటుకు తరలించే ఏర్పాట్లు త్వరగా చేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. మద్యం సేవించి వాహనాలను నడపడం నేరమని ఆయన గుర్తు చేశారు. రోడ్డు ప్రమాదానికి ఎవరైనా గురైతే ప్రత్యక్ష సాక్షులేవరైనా ముందుకొచ్చి ప్రమాదానికి గురైన వ్యక్తిని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పిస్తే వారిపూర్వాపరాలను గురించి ఖచ్ఛితంగా అడగాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రమాదాన్ని గురించి ప్రత్యక్ష సాక్షి తోనే స్వయంగా వివరాలనుప తెలిపితే వాటిని పరిగణనలోనికి తీసుకోవచ్చని, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రమాదానికి గురైన వ్యక్తికి వెంటనే ప్రభుత్వ చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే నష్టాల గురించి ప్రజల్లో వివిధ మాద్యమాలద్వారా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లాలో జరిగిన వివిద రోడ్డు ప్రమాదాల పై తీసుకున్న చర్యల పై కలెక్టర్ ఆరాతీశారు. ఇటీవల పాలమాకులలో జరిగిన ప్రమాదానికి సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించాలని అన్నారు. ఆరంగిర్-శంషాబాద్ రోడ్డులో ప్రమాదాలను నివారించడానికి రోడ్డు మీడియన్ పై బారికేడింగ్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాలను అరికట్టేందుకు సమగ్రమైన కార్యాచరణ ప్రణాళిక తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు. ఈ రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమీషనర్ ప్రవీనరావు, అధికారులు పాల్గొన్నారు.