హైదరాబాద్

చట్టాలు అమలైతేనే సత్వర న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 19: సమర్ధవంతమైన పాలన, శాసనాలు, న్యాయవ్యవస్థ వుంది కానీ చట్టాలు సక్రమంగా అమలైతేనే సత్వర న్యాయం జరుగుతుందని ఉభయ తెలుగు రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి అన్నారు. జస్టిస్ పిసిరెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో జరిగిన 17వ వార్షిక అవార్డుల ప్రదానోత్సవానికి జస్టిస్ సుభాషణ్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సమాజంలో మహిళా వివక్ష పోవాలని, నిజానికి ఎన్ని చట్టాలు చేసినా లంచగొండితనం పెరిగిపోవడంతో సక్రమంగా పాలన జరగడంలేదని అన్నారు. ‘అంగట్లో అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లు శాసనాలను అమలు చేసుకోలేక పోతున్నామని ఆయన అన్నారు. శతాబ్దాల కాలంగా మహిళలపై వున్న వివక్ష పోగొట్టాలనేదే పిసిరెడ్డి ఉద్దేశమని, రాజ్యాంగంలోనే పేర్కొన్నారని అన్నారు. పేదవారిని ప్రోత్సహించాలని ట్రస్ట్ ఏర్పాటుచేసి సక్సెస్‌గా నడిపిస్తున్నారని, పిసిరెడ్డిని యువత ఆదర్శంగా తీసుకొని ఎదగాలని ఆయన సూచించారు. సభకు అధ్యక్షత వహించిన విశ్రాంత ఏపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పిసిరెడ్డి మాట్లాడుతూ, జ్ఞానం మగవారిలో కంటే ఆడవారిలో అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుందని. పూర్వకాలంలో ధర్మం నశించి అధర్మం పెరిగినందునే శ్రీకృష్ణుడు అవతరించాడని, అధర్మం పూర్తిగా నశించినపుడే ధర్మం సక్రమంగా ఉంటుందని దేనికైనా మంచితనం అవసరం అన్నారు.
పంజాబ్ ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించిన విషయం గుర్తుచేసారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో పేదవారిని ఎంపికచేసి ఆర్థికంగా సహాయపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో న్యాయశాస్త్రం నుండి పి.వాసవి, కె.సునీత, కె.లక్ష్మీతులసి, వైద్య శాస్త్రం నుంచి కె.చంద్రకళ, పి.కార్తి, చింతా జీవన్, షేక్‌షీపా సుల్తాన్, టి.శివప్రియాంక, సాంకేతిక శాస్త్రం నుంచి సి.కృష్ణనివేదిత, పి.సాయిదివ్య, బి.మమత, జానకి, గీతాతరంగిణి, సౌమ్య, సాయిచేతన, సుజాత, ఆర్ట్ విభాగం నుంచి కావేరి, క్రీడా విభాగంలో పి.కీర్తి, కళలనుంచి టి.గౌరిప్రియలకు యాభైవేల నగదు, రజత పతకాన్ని ప్రదానం చేసారు. తొలుత శ్రీకాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తొలుత కూచిపూడి నాట్యాచారిణి మద్దాళి ఉషాగాయత్రి శిష్యులు నృత్యం ప్రదర్శించారు.

సుబ్బారావు స్మారక అవార్డు ప్రదానం
కాచిగూడ, మార్చి 19: డా.మద్దాళి సుబ్బారావు జయంతి సందర్భంగా ప్రముఖ వేద విజ్ఞాన పరిరక్షకుడు డా.రేమెళ్ళ అవధానులుకు డా.మద్దాళి సుబ్బారావు స్మారక అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం కినె్నర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో ఆదివారం గానసభలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ ప్రభుత్వ సలహదారుడు డా.కెవి రమణచారి పాల్గొన్నారు. డా.రేమెళ్ళ అవధానులుకు మద్దాళి సుబ్బారావు స్మారక అవార్డు ప్రదానం చేశారు. అనంతరం అయన మాట్లాడుతూ సుబ్బారావు సాహిత్య రంగన్నికి అనేక సేవలు చేశారని కొనియాడారు. సుబ్బారావు పేరిట పురస్కార ప్రదానం చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. చారిత్రక నవలా చక్రవర్తి ఆచార్య ముదిగొండ శివప్రసాద్ సభాధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ ఎ.రాములు, ప్రముఖ సాహితీవేత్త డా.వోలేటి పార్వతీశం, సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు డా.ఆర్.ప్రభాకరరావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.