హైదరాబాద్

కబ్జా నుంచి చెరువులకు విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 19: గ్రేటర్ పరిధిలోని కోట్లాది రూపాయాల విలువైన భూములను జిహెచ్‌ఎంసి అధికారులు పరిరక్షించారు. గుట్టల బేగంపేటలోని మేడికుంట, సున్నం చెరువుల్లో కబ్జారాయుళ్లు పథకం ప్రకారం వ్యర్ధాలు వేసి నిర్మించిన పక్కా భవన నిర్మాణాలను తొలగించడానికి చర్యలు చేపట్టారు. మేయర్ బొంతు రామ్మోహన్ ఆదేశాలతో జిహెచ్‌ఎంసి నీటి పారుదల విభాగం ఆధ్వర్యంలో చెరువుల సర్వేను చేపట్టి తొలగించడానికి ఉపక్రమించారు. అక్రమ నిర్మాణం చేపట్టిన వ్యక్తులు అధికారులపై దాడులకు కూడా పాల్పడటంతో కఠినంగా వ్యవహరించాలని మేయర్ రామ్మోహన్ పోలీసులను కోరారు. పోలీసు భద్రత నడుమ అధికారులను ఆక్రమణలను పూర్తిగా తొలగించి, జెసిబిలతో నిర్మాణాలను కూల్చివేశారు. సున్నం చెరువులోని ఎఫ్‌టిఎల్‌లో కూడా చేపట్టిన అక్రమ నిర్మాణాలను సైతం జిహెచ్‌ఎంసి అధికారులు కూల్చివేస్తుండగా 50 మందికిపైగా ప్రతిఘటించారు. డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. సున్నం చెరువులోని ఆక్రమణలను డిప్యూటి మేయర్ స్థానిక కార్పోరేటర్ సబిహా బేగం స్వయంగా దగ్గరుండి తొలగించడంలో అధికారులు, పోలీసులకు సహకరించారు. 23 ఎకరాల వైశాల్యం ఉన్న ఈ చెరువుల చుట్టూ ఇనుప స్థంబాలు అమర్చి జాలీలు వేసే ప్రక్రియను అధికారులు చేపట్టారు.

సిఎం వ్యాఖ్యలను ఖండించిన గంగపుత్రుల సంఘం
ముషీరాబాద్, మార్చి 19: తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రులు కేవలం మూడు లక్షల మంది మాత్రమేనని, నాలుగు ప్రాంతాలలో అసలు లేనేలేరని ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రగతి భవన్‌లో చేసిన వాఖ్యలను తెలంగాణ రాష్ట్ర (బెస్త) గంగపుత్ర సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం హైదర్‌గూడ న్యూస్‌సెంటర్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆర్‌కె ప్రసాద్, మెట్టు ధన్‌రాజ్, కె.మల్లేష్, రమేష్‌బాబు, ఆర్.లక్ష్మణ్, ఎ.శ్యామ్‌రావు, డి.శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో గంగపుత్రులు 25 లక్షల పైచిలుకు ఉన్నారనీ ముఖ్యమంత్రి ప్రకటించిన నాలుగు ప్రాంతాలు వరంగల్ డివిజన్ ములుగు మండలం 22 గ్రామాలలో 15 వేలు, భద్రాచలంలో 20 వేలు, ఆదిలాబాద్‌లో 40 వేలు, మహబూబ్‌నగర్‌లో 40 వేలు పైచిలుకు ఉన్నారని తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడ్డ గంగపుత్రులను ఎస్సీ జాబితాలో కలపాల్సింది పోయి ముదిరాజ్‌లను గంగపుత్రులు ఉన్న బిసి-ఎ జాబితాలో చేర్చే ప్రయత్నంలో భాగంగానే గంగపుత్రుల జనాభా తక్కువ చూపుతున్నారని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి సమగ్ర కుటుంబ సర్వేలో గంగపుత్రుల జనాభా శాతం ఉందని, లేనిపక్షంలోతాము మరోసారి నివేదిక సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.