హైదరాబాద్

ఆగని అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 21: ఉన్నతాధికారుల పొరపాటో...జిహెచ్‌ఎంసి గ్రహపాటో చెత్తతరలింపు విభాగంలో అక్రమాలు, అవకతకవలకు బ్రేక్ పడటం లేదు. నష్టాల నుంచి గట్టెక్కేందుకు జిహెచ్‌ఎంసి నుంచి ఏటా రూ. 230 కోట్లను తీసుకున్న ఆర్టీసి ఇపుడు కొత్త వాహనాలను కొనుగోలు చేసేందుకు సిద్దపడ్డా, చెత్త రవాణా పేరిట కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న జిహెచ్‌ఎంసి అధికారులెందుకు కొత్త వాహనాల కొనుగోలుపై శ్రద్ధ చూపటం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. దీర్ఘకాలంగా రింగ్ అవుతున్న కొందరు కాంట్రాక్టర్లు, అక్రమార్కులైన కొందరు అధికారులకు ప్రయోజనం సమకూర్చేందుకేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కమీషన్ల కోసమే అద్దె వాహనాలను ఎక్కువ సంఖ్యలో వినియోగిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రవాణా విభాగంలో
ఇష్టారాజ్యంగా ఇండెంట్లు
మరమ్మతుల పాలైన వాహనాలకు అమర్చాల్సిన విడిభాగాలు ఇతర అవసరాల కోసం రాసుకునే ఇండెంట్లకు సంబంధించి గతంలో నాలుగు అంచెలుగా అనుమతులు, మంజూరీ పొందాల్సి ఉండేది. కానీ ఇపుడు కేవలం రెండు అంచెల్లో మాత్రమే ఈ ఇండెంట్లు రాసుకుని మంజూరు చేసుకోవటం కూడా ఎక్కువ ఖర్చయ్యేందుకు ఓ కారణమన్న వాదన ఉంది. వాహనాల మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలు మెకానిక్, ఫోర్‌మెన్‌ల సంతకాలు చేయాల్సి ఉండగా, వారి సంతకాల్లేకుండానే మలక్‌పేట పార్కింగ్ యార్డులో ఏఈ, డిఇల సంతకాలతో ఇండెంట్లు రాసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఉన్న 400 మంది డ్రైవర్లు, క్లీనర్లు రోడ్డున పడే పరిస్థితులు నెలకొన్నా, ఏ ఒక్క కార్మిక, ఉద్యోగ సంఘం కానీ స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు కాలం చెల్లిన వాహనాలను తొలగిస్తున్నామని చెప్పుకుంటున్న అధికారులు అటు కొత్త వాహనాలను కొనుగోలు చేయకుండా అద్దె వాహనాలకు గ్రేటర్ నిధులను సంతర్పరణ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక, కార్పొరేషన్‌కు చెత్తను తరలించే వాహనాలున్నా, వాటికి వచ్చే మైనర్ రిపేర్లను అధికారులు భూతద్దంలో చూపుతూ, అద్దె వాహనాలను వినియోగిస్తూ నిధులను కాంట్రాక్టర్లకు ధారాధత్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన బల్దియాను గట్టెక్కించేందుకు ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రయత్నాలు చేస్తూ నిధులను సమీకరిస్తుండగా, మరోవైపు చెత్త తరలింపు, వాహనాల మరమ్మతులు, అద్దె వాహనాల ఛార్జీలంటూ రవాణా విభాగం అధికారులు ఖజానాను ఖాళీ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి చెత్తను తరలించే ప్రక్రియను ప్రధాన కార్యాలయంలోని టిసివో విభాగం పర్యవేక్షించేందుకు గానీ పదకొండు నెలల క్రితం కమిషనర్ ఈ ప్రక్రియను జోన్ల వారీగా వికేంద్రీకరించారు. అవసరాలకు తగిన విధంగా జోనల్ కమిషనర్లు, సర్కిళ్ల మెడికల్ ఆఫీసర్లు వాహనాలను సమకూర్చుకునే వెసులుబాటు కల్పించటంతో రవాణా విభాగంలో వాహనాలు తగ్గినా, ఖర్చు చేస్తున్న నిధులు ఏ మాత్రం తగ్గటం లేదు. గతంలో ప్రధాన కార్యాలయంలో కేంద్రీకృతమై ఉండే చెత్త రవాణా విభాగంలో నెలకు రూ. 2 కోట్లు మాత్రం ఖర్చు చేసేవారు. ఇతరత్ర ఖర్చులు కలుపుకుని ఏడాదికి రూ. 24 కోట్ల వరకు ఖర్చయ్యేవి. యగా, ఈ ప్రక్రియను వికేంద్రీకరించిన తర్వాత ఈ వ్యవయం పది రేట్లు పెరిగిందని చెప్పవచ్చు. అవినీతి, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో వికేంద్రీకరణ సంస్కరణలను తీసుకువచ్చామని అధికారులు చెబుతున్నా, వికేంద్రీకరణకు ముందైన ఖర్చు కంటే తర్వాత అవుతున్న ఖర్చే అధికంగా ఉండటం గమనార్హం. ప్రతిరోజు నగరంలో సుమారు నాలుగువేల మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. ఈ చెత్తను జిహెచ్‌ఎంసి రవాణా విభాగం భారీ వాహనాల ద్వారా శివారులోని డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. కవాడిగూడ, ఖైరతాబాద్, మలక్‌పేటలలో వాహనాల మరమ్మతులు చేసేందుకు మూడు పార్కింగ్ యార్డులున్నాయి. రవాణా విభాగాన్ని వికేంద్రీకరించిన తర్వాత ఈ పార్కింగ్ యార్డుల్లో కాలం చెల్లిన జిహెచ్‌ఎంసి వాహనాలను తొలగించారు. మిగిలిన వాహనాలకు రూ. 20వేల లోపు చేసే మర్మతులను మైనర్, అంతకన్నా ఎక్కువ ఖర్చయ్యే రిపేర్లను మేజర్‌గా పరిగణిస్తున్నారు. ఈ మేజర్ మరమ్మతులకు సంబంధించి ఆధీకృత డీలర్లతోనే మరమ్మతులు చేయించాలన్న నిబంధన కూడా విధించారు. సాధారణంగా వాహనాల సంఖ్య తగ్గినపుడు ఖర్చు కూడా తగ్గాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కొనసాగుతోంది.

పెరిగిన అద్దె వాహనాలు...పర్యవేక్షణ అధికారులు
ఇదివరకు చెత్తను ట్రాన్స్‌ఫర్ స్టేషన్ నుంచి జవహర్‌నగర్‌కు జిహెచ్‌ఎంసికి వాహనాల ద్వారానే తరలించేవారు. అవసరాలకు తగిన విధంగా అపుడపుడు చాలా చిన్న సంఖ్యలో మాత్రమే అద్దె వాహనాలను ఇమ్లిబన్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్‌లో వినియోగించేవారు. కానీ జిహెచ్‌ఎంసికి ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల సంఖ్య 20కి పెరగటంతో ఇపుడు అద్దె వాహనాల సంఖ్య కూడా పెరిగింది. రవాణా విభాగానికి జరిపిన కేటాయింపుల్లో సింహభాగం మొత్తాన్ని అద్దె వాహనాలకే వెచ్చించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో చెత్తను తరలించేందుకు మొత్తం 790 వాహానాలుండగా, వీటిలో కాలం చెల్లిన వాహనాలను మినహాయిస్తే ప్రస్తుతం 400 వరకు మాత్రమే వాహనాలు మాత్రమే ఉన్నా ఖర్చు తగ్గలేదు. వికేంద్రీకరణకు ముందు కేవలం ఎనిమిది మాత్రమే ఇంజనీర్లు పనిచేస్తుండేవారు. కిపుడు ఇంజనీర్లు, డ్రైవర్లు, కార్మికుల వేతనాలకు నెలకు రూ. 6.35లక్షల వ్యయం అయ్యేది. వికేంద్రీకరణ తర్వాత ఒక సిటీవో, 6 మంది డిప్యూటీ సిటివోలు, 42 మంది ఎఈలు పనిచేస్తున్నారు. ఇంజనీర్లు, డ్రైవర్లు, కార్మికుల వేతనాలకు నెలకు రూ. 56.75 లక్షల వరకు వ్యయం పెరిగింది. 790 వాహనాల నిర్వాహణను కేవలం ఎనిమిది ఇంజనీర్లు చూసుకోగా, ఇపుడున్న కేవలం 400 వాహనాల నిర్వాహణకు 50 మంది ఇంజనీర్లను నియమించటం వల్లే వ్యయం పెరుగుతున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.