హైదరాబాద్

హేరామ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, మార్చి 22: ప్రాణాపాయ స్థితిలో వైద్యసేవల కోసం వచ్చిన అభాగ్యులను అక్కున చేర్చుకుని స్వాంతన చేకూర్చాల్సిన సిబ్బంది అమానుషంగా వ్యవహరించడం.. అంతరించి పోతున్న మానవత్వ విలువలకు అద్దం పడుతోంది. గాంధీ ఆసుపత్రిలో తరచు చోటు చేసుకుంటున్న అమానుష సంఘటనలు ప్రభుత్వ పరువును బజారు కీడ్చడంతోపాటు అడుగంటిపోతున్న విలువలకు దర్పణం పడుతోంది. వైద్యో నారాయణోహరి అన్న విషయాన్ని విస్మరించి ఒకవైపు ప్రైవేటు ఆసుపత్రులు ధన దాహంతో శవాలకు సైతం వైద్యం చేస్తూ డబ్బులు దండుకుంటుంటే, పేదలకు అభాగ్యులకు వైద్య సేవలు అందించడానికి కోట్లాది రూపాయల నిధులను వెచ్చించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అతిపెద్ద ధర్మాసుపత్రుల్లోని సిబ్బంది చేతివాటంతో అభాసుపాలౌతోంది. జిల్లాల నుంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు ఏదైనాప్రమాదకరమైన జబ్బు చేసిందంటే గుర్తుకు వచ్చేది నగరంలోని గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులే. అలాంటి ఆసుపత్రులు పర్యవేక్షణ లోపంతో మాకెందుకులే అన్న ధోరణితో తూతూమంత్రపు చర్యలు తనిఖీలు చేస్తున్న అమాత్యులు అధికారులు ఉన్నంత కాలం ఇలాంటి ఇబ్బందులు తప్పవనడంలో ఎంతమాత్రం అతిశయోక్తిలేదు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రధాన పౌరుడు గాంధీ ఆసుపత్రి దుస్థితిపై తనిఖీలు చేయడంతోపాటు చలించిపోయిన సంఘటనలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో ప్రధాన కార్యదర్శిని వివరణ కోరినా, ఒకవైపు వైద్యశాఖామంత్రి, మరోవైపు స్థానికంగా ముగ్గురు మంత్రుల నియోజకవర్గాల్లో విస్తరించిన ఉన్న గాంధీ ఆసుపత్రి పరిస్థితిలో మార్పులు రాకపోవడం విడ్డూరంగా ఉంది. తరుచూ వైద్య సిబ్బంది ధర్నాలు ఆందోళనలు మరోవైపు సిబ్బంది నిర్లక్ష్యపు దోరణులు వెరసి రోగుల ఆరోగ్యం దైవాధీనంగా ఉంది. కాలం చెల్లిన సెలైన్‌లతో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా అమాత్యులు స్పందించరు. అందుకు బాధ్యులైన వారిని శిక్షించరు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సరే ముందు అవినీతి, నిర్లక్ష్యపు మత్తులో జోగుతున్న అధికారుల భరతం పట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఖాళీలను భర్తీ చేయడంతోపాటు కాంట్రాక్టు వ్యవస్థకు స్వస్తి పలకాల్సిన అవసరం ఉంది. అమాత్యుల అండదండలతో అవగాహన లేని వారికి కాంట్రాక్టులు అప్పగించకుండా సేవాభావంతోపాటు అనుభవం ఉన్న వారికి అవకాశం ఇస్తే కొంతలో కొంతైనా మార్పులు వచ్చే అవకాశం ఉంది. కార్పోరేట్ ఆసుపత్రులకు దీటుగా నిర్మించిన గాంధీ ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ ఓ ప్రహసనంలా మారిపోయింది. అనారోగ్యంతో ఆరోగ్యం కోసం వచ్చే రోగులకు ఉన్న రోగం సంగతి దేవుడెరుగు, కొత్తరోగాలు అంటుకునే అత్యంత భయానక పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభుత్వం తరపున కోట్లాది రూపాయల నిధులు కేటాయించడంతోనే సరిపోదు.. నిధులు సక్రమంగా వినియోగం అయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దలపై ఎంతైనా ఉంది. కిందిస్థాయి కాంట్రాక్టు సిబ్బందిని తొలగించి చేతులు దులుపుకోవడంతో సరిపోదు, పర్యవేక్షణ చేయకుండా నిర్లక్ష్యం వహించి అధికారులపై కూడ కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.