హైదరాబాద్

నృత్య గురువులకు సత్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ‘జాతీయ నృత్యోత్సవం -2017’లో భాగంగా బుధవారం సాయంత్రం రవీంద్రభారతిలో జరిగిన ముగింపు కార్యక్రమంలో బెంగళూరుకు చెందిన ధరణీ కాశ్యప్ ‘నవజనార్ధనం’ ప్రదర్శించారు. అనంతరం డా.మల్లికా కండాలి సత్రియ నృత్యం ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. డా.అలేఖ్య పుంజల బృందం ప్రదర్శించిన ‘రుద్రమ’ నృత్యరూపకం కార్యక్రమానికి హైలైట్‌గా అభినందనలు అందుకుంది. నృత్య గురువులు శ్రీరంగం రాఘవకుమారి, డా.సువర్చలాదేవి, పేరిణి శ్రీనివాస్‌ను శాలువాతో జమున సత్కరించారు. కార్యక్రమానికి వైస్‌చాన్సలర్ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షత వహించగా రిజిస్ట్రార్ సత్తిరెడ్డి స్వాగతం పలికారు.