హైదరాబాద్

‘ఇండియన్ ఐడల్’ ఫైనల్స్‌కు చేరిన తెలుగుతేజం రేవంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్: సోనీ టివి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ కాంటెస్ట్‌కు తెలుగు తేజం ఎల్‌వి రేవంత్ ఎట్టకేలకు ఫైనల్స్‌కు చేరాడు. ఏప్రిల్ 2న జరగనున్న ఫైనల్స్‌లో టైటిల్‌ను సాధించితీరుతానని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. ఫైనల్స్‌కు చేరిన రేవంత్‌కు బుధవారం ఆయన అభిమానులు, స్నేహితులు ఘనస్వాగతం పలికారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ మార్చి 26 నుండి ఏప్రిల్ 2వరకు జరిగే నిర్విరామ ఓటింగ్‌లో తనను గెలిపించాలని కోరారు. సోనీ యాప్, ఆన్‌లైన్ ద్వారా తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ సోదరుడు సంతోష్, తల్లి సీతామహాలక్ష్మి పాల్గొన్నారు.