హైదరాబాద్

నిర్మాణ రంగంలో రక్షణపై మేథోమదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: మహానగరంలో వేగవంతంగా సాగుతున్న నిర్మాణ రంగంలో రక్షణ చర్యలపై జిహెచ్‌ఎంసి దృష్టి సారించింది. ముఖ్యంగా ఇటీవల నిర్మాణంలో ఉన్న భవనాలు కూలి, కార్మికులు ప్రాణాలు కోల్పోవటం వెనకా ఇంజనీరింగ్ పర్యవేక్షణ లోపం కారణంగా కన్పిస్తోందని వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిహెచ్‌ఎంసి సివిల్ ఇంజనీర్స్ అసొసియేషన్ హైదరాబాద్ విభాగం సంయుక్త్ధ్వార్యంలో భూగర్భ నిర్మాణాల్లో భౌగోళిక సాంకేతిక అంశాలు-సవాళ్లు అనే అంశంపై గురువారం ఆయన బంజారాహిల్స్‌లోని ఆస్కీలో వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన కమిషనర్ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో పెద్ద ఎత్తున జరుగుతున్న నిర్మాణాల సందర్‌భంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. ప్రధానంగా కూకట్‌పల్లి నానక్‌రాంగూడ, మాదాపూర్‌లలో ఇటీవల జరిగిన ప్రమాదాల్లో అమాయక కూలీలు దుర్మరణం పాలయ్యారని అన్నారు. ఈ ఘటనలకు కారణం ఆయా భవన నిర్మాణాల స్థలంలో సంబంధిత సంస్థల ఇంజనీర్ల పర్యవేక్షణ లోపమని అన్నారు. భవన నిర్మాణాల సందర్భంగా చేపట్టాల్సిన భద్రత చర్యలు, పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు తదితర అంశాలపై జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో సైట్ సూపర్‌వైజర్లు, సహాయ ఇంజనీర్లు, మేస్ర్తిలకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశామని గుర్తుచేశారు. భారీ నిర్మాణాల విషయంలో ముఖ్యంగా హైదరాబాద్ లాంటి పురాతన నగరంలో భూగర్భంలో నిర్మాణం చేసేటపుడు మరింత అప్రమత్తత అవసరమని సూచించారు. అనంతరం చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలో వాణిజ్య భవనాలకు 44 శాతం, మల్టీప్లెక్సుల నిర్మాణానికి 60 శాతం విస్తీర్ణాన్ని పార్కింగ్ ఏరియాగా నిర్ణయించామని తెలిపారు. సెల్లార్ల నిర్మాణంలో మరింత పటిష్టమైన చర్యలు రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. సైట్ సూపర్‌వైజర్ల పర్యవేక్షణ లోపం, ఆర్కిటెక్ట్‌ల సూచనలు సక్రమంగా లేకపోవటం వల్ల ఇటీవల సెల్లార్లు, నిర్మాణాలు కూలిన సంఘటనలు జరిగాయని వివరించారు. జెఎన్‌టియు సివిల్ ఇంజనీర్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎన్.వి. రమణారావు మాట్లాడుతూ నగరంలో భారీ ప్రాజెక్టుల నిర్మాణాల సందర్భంగా ఫౌండేషన్ ఇంజనీర్లు, సేఫ్టీ ఇంజనీర్లు కూడా నిర్మాణాలను పర్యవేక్షించాలని సూచించారు. సివిల్ ఇంజనీర్స్ అసోసియేషన్స్ హైదరామాద్ చైర్మన్ కె. రాజ్‌కుమార్ మాట్లాడుతూ 400 ఏళ్లకు పైగా చరిత్ర కల్గిన హైదరాబాద్ నగరంలో భిన్న రకాల భూములు కల్గి ఉన్నాయన్నారు. ప్రధానంగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ పై భాగంలో పర్వత శ్రేణి కల్గి ఉన్నాయని, ఈ పర్వతాలు ప్రపంచంలోనే రెండవ పురాతన రాళ్లతో కల్గి ఉన్నాయని,ఆస్ట్రేలియాలోని పర్వతాలు అత్యంత పురాతనమైనవని వివరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణాలు ముఖ్యంగా సెల్లార్ల నిర్మాణంలవో చేపట్టాల్సిన సేఫ్టీ విధానాలపై పలువురు ప్రముఖ ఇంజనీర్లు తమ అభిప్రాయాలను వివరించారు.