హైదరాబాద్

నిధులు..విధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 23: జిహెచ్‌ఎంసి అధికారుల పనితీరు గమ్మత్తుగా తయారైంది. ముఖ్యంగా నాలాల ఆధునీకరణ విషయంలో నిధులు పుష్కలంగా ఉన్నపుడు సక్రమంగా విధులు నిర్వర్తించని అధికారులు ఇపుడు ఆక్రమణలను గుర్తించినా, నాలాల ఆధునీకరణకు నిధులెక్కడి నుంచి సమకూర్చుకోవాలంటూ తర్జనభర్జన చేస్తున్నారు. నిధులు పుష్కలంగా ఉన్నపుడు విధులు నిర్వర్తించని అధికారులు ఇపుడు సక్రమంగా విధులు నిర్వర్తించి నాలాలను ఆధునీకరించేందుకు సిద్దమైనా నిధుల లేమీ వెంటాడుతోంది. నగరాన్ని వరద ముంపు నుంచి రక్షించేందుకు ప్రస్తుతం జిహెచ్‌ఎంసి ఆక్రమణల తొలగింపుతో హడావుడి చేస్తున్నా, నాలాల ఆధునీకరణ, బాధితులకు నష్టపరిహారం, ప్రత్యామ్నాయ పునరావాసానికి నిధులు ఎక్కడినుంచి సమకూర్చుకోవాలన్నవిషయంపై అధికారులు తర్జనభర్జ చేస్తున్నారు. పదేళ్ల క్రితం నిధులు పుష్కలంగా ఉన్నపుడు సక్రమంగా విధులు నిర్వహించని అధికారులు ఇపుడు ఆక్రమణలను తొలగిస్తున్నా, వారికి నష్టపరిహారం చెల్లించేందుకు, ప్రత్యామ్నాయ పునారావసం కల్పించటంతో పాటు సగం శాతం ఆగిన నాలాల ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు నిధులెక్కడి నుంచి సమీకరించుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నోడల్ సంస్థ అయిన జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నగరంలోని నాలాల ఆధునీకరణకు రూ. 210 కోట్లను కేటాయించినా, జిహెచ్‌ఎంసి అధికారులు మాత్రం ఇందులో కేవలం రూ. 140 కోట్లను మాత్రమే సద్వినియోగం చేసుకోగలిగారు. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో పనులు ముందుకు సాగకపోవటంతో నిధులు తిరిగి జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎంకు వెళ్లిపోయాయి. ప్రధానంగా వరద నీరు ప్రవహించే సుమారు 390కిలోమీర్ల పొడవైన నాలాలపై వీటిపై సుమారు సుమారు పదివేల పై చిలుకు ఆక్రమణలున్నట్లు గుర్తించారు. వీటిని తొలగించి బాధితులకు ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించేందుకు శివార్లలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం, వాంబే స్కీం కింద దాదపు 23వేల 696 ఇళ్లను కూడా నిర్మించారు. కానీ అప్పట్లో నెలకొన్న రాజకీయ పరిస్థితుల కారణాల దష్ట్యా ఆక్రమణలను తొలగించేందుకు క్షేత్ర స్థాయిలో అనేక రకాల అడ్డంకులు ఎదురుకావటం, వీరికి ప్రత్యామ్నాయ పునరావాసం కల్పించటం వంటివి ప్రధాన అడ్డంకుల కారణంగా నాలాల పనులు సక్రమంగా జరగకపోవటం వల్లే జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులు వెనక్కి వెళ్లిపోయాయి. ఇపుడు మిగిలిన పనులను పూర్తి చేసేందుకు మరో సారి కేంద్రాన్ని నిధులు అభ్యర్థిస్తోంది జిహెచ్‌ఎంసి. గత ఆర్థిక సంవత్సరం 13 ఆర్థిక సంఘాన్ని నిధులు కోరినా, ఫలితం దక్కకపోయినా, మరో సారి అదే ప్రయత్నం చేయాలని జిహెచ్‌ఎంసి భావిస్తోంది. కానీ నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి త్వరలో చేపట్టనున్న స్కైవేల కోసం ఇప్పటికే కేంద్రాన్ని ప్రభుత్వం రూ. 5వేల కోట్లను కోరిన నేపథ్యంలో మళ్లీ నాలాలకు కేటాయించే అవకాశం లేదనే చెప్పవచ్చు. దీంతో ఈ నాలాల ఆధునీకరణ పనులను జిహెచ్‌ఎంసి నిధుల నుంచి చేపట్టాలా? లేక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు అభ్యర్థించాలా? అన్న అయోమయంలో జిహెచ్‌ఎంసి అధికారులున్నారు.
ఆర్థిక సంఘానికి పంపనున్న ప్రతిపాదనలు
జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం నిధులతో గతంలో చేపట్టిన నాలాల ఆధునీకరణ పనులు వివిధ దశల్లో ఆగిపోయాయి. వీటిని పూర్తి చేసేందుకు నిధులను అభ్యర్థిస్తూ జిహెచ్‌ఎంసి 13వ ఆర్థిక సంఘానికి 12 నాలాలకు సంబంధించి ఆగిపోయిన 26.46కిలోమీటర్ల మేరకు పనులను పూర్తి చేసేందుకు రూ. 222.83 కోట్లను కోరుతూ గత సంవత్సరం పంపిన ప్రతిపాదనలను మళ్లీ 14వ ఆర్థిక సంఘానికి పంపాలని భావిస్తున్నారు. కానీ ఎస్‌ఎస్‌ఆర్ రేట్ల ప్రకారం ఈ అంచనాలు కూడా స్వల్పంగా పెరిగే అవకాశాల్లేకపోలేవు.

ఈతకు వెళ్లి ఒకరి మృతి
ఇద్దరు గల్లంతు..?
తాండూరు, మార్చి 23: దేవస్థాన కోనేరులో ఈతకు వెళ్లి ముగ్గురు యువకుల్లో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు గల్లంతైన సంఘటన యాలాల మండలం గుంటిపల్లిలో చోటుచేసుకుంది. సీతారామ దేవస్థానంలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఆలయ కోనేరులో ఈతకు ముగ్గురు దిగినట్లు అక్కడ వదిలేసిన దుస్తువులను బట్టి తెలుస్తోంది. కానీ, చెప్పుల జత ఒకటే ఉంది. యాలాల ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ గాలింపు కొనసాగుతోందని పెద్దముల్ మండలంకు చెందిన అజయ్ మృత దేహం లభ్యమైందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
త్వరలో పాఠశాల భవన నిర్మాణం
కొత్తూరు, మార్చి 23: నందిగామ మండల పరిధిలోని చేగూరు ఉన్నత పాఠశాలను మహేష్‌బాబు గ్రామఫౌండేషన్ ఇన్‌చార్జి సౌజన్య గురువారం సందర్శించారు. సినీ నటుడు మహేష్‌బాబు దత్తత తీసుకున్న సిద్దాపూర్ గ్రామంలో నూతనంగా పాఠశాల భవనాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు. పాఠశాల భవనం ఎలా నిర్మించాలనే ఆలోచనలో భాగంగానే చేగూరు ఉన్నత పాఠశాలను సందర్శించామని తెలిపారు. సిద్దాపూర్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి నాట్కో ట్రస్ట్ 30లక్షల రూపాయల చెక్కును సినీ నటుడు మహేష్‌బాబు భార్య నమ్రత శిరోద్కర్‌కు అందజేశారని వివరించారు. చెక్కును నమ్రత శిరోద్కర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు అందించనట్లు తెలిపారు. సిద్దాపూర్ గ్రామంలో త్వరలోనే నూతన పాఠశాల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపిపి శివశంకర్‌గౌడ్, ఎంపిడివో జ్యోతి, నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ట్రక్కును ఢీకొన్న లారీ: ఒకరి మృతి
రాజేంద్రనగర్, మార్చి 23 : ఆగి ఉన్న ట్రక్కును ఓ లారీ ఔటర్ రింగురోడ్డుపై ఢీకొన్న సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాజేంద్రనగర్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రానికి చెందిన లారీ (హెచ్‌ఆర్55వి 1322) హర్యానా నుంచి ఓఆర్‌ఆర్ మీదుగా చెన్నై వెళ్తోంది. హిమాయత్‌సాగర్ వద్ద పక్కకు పార్క్ చేశారు. అదే సమయంలో లారీ (ఎపి 07 టిహెచ్ 2355) వాహనం అదే దిశలో వెనుక నుంచి ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ట్రక్కు వెనుక వైపు ఉన్న టైర్ల గాలిని చెక్ చేస్తున్న క్లీనర్ సబేర్‌ను లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన సబేర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.