హైదరాబాద్

షీ-టాయిలెట్ల ఏర్పాటుకు బిడిఎల్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: మహానగరంలో మహిళల సౌకర్యార్థం టాయిలెట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్న జిహెచ్‌ఎంసికి భారత్ డైనమిక్ లిమిటెడ్ సంస్థ చేయూతనివ్వనుంది. వీటిని ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ. 2 కోట్లను జిహెచ్‌ఎంసికి అందజేసింది. అంతేగాక, మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి, బిడిఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డా.ఎన్.కె.రాజులు సంతకాలు చేసి ఓ ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, పారిశుద్ద్య కార్యక్రమాల నిర్వాహణలో పలు కార్పొరేట్ సంస్థలు భాగస్వాములు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎస్‌బిహెచ్ హడ్కో, ఐవోసి తదితర సంస్థలు ఎన్నో ముందుకువచ్చాయని వివిరంచారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ మాట్లాడుతూ 60కి పైగా షీ టాయిలెట్ల ఏర్పాటుకు పలు సంస్థలు ఆర్థిక సహాయాన్ని అందించినట్లు వివరించారు. చార్మినార్, సికిందరాబాద్ పాస్‌పోర్టు ఆఫీసు, గోల్కొండ, మెహిదీపట్నం బస్టాండు, దిల్‌సుఖ్‌నగర్ బస్టాండు, సికిందరాబాద్ బస్టాండు, కెబిఆర్ పార్కు, శిల్పారామం బస్టాపువంటి తదితర ప్రాంతాల్లో టాయిలెట్ల ఏర్పాటు వివిధ దశల్లో ఉన్నాయని, బిడిఎల్ ఇచ్చే నిధులతో మరో 30 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నామని ఆయన వెల్లడించారు. బిడిఎల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఎన్.కె. రాజు మాట్లాడుతూ ఎఎస్‌ఆర్‌లో భాగంగా హైదరాబాద్ నగరంలో వచ్చే మూడేళ్ల పాటు షీ టాయిలెట్లను ఏర్పాటు చేయటానికి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎంసి అదనపు కమిషనర్ రవికిరణ్, జోనల్ కమిషనర్ హరిచందన తదితరులు పాల్గొన్నారు.

మక్కా పేలుళ్ల కేసులో
నిందితుల విడుదల

హైదరాబాద్, మార్చి 25: హైదరాబాద్ మక్కామసీదు బాంబు పేలుళ్ల కేసులో నిందితులు అసిమానంద స్వామి, భరత్‌కుమార్ భాయ్‌లకు గురువారం నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసులో వీరు చంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం బెయిల్‌పై విడుదలైన వీరు గుజరాత్‌కు చెందిన వారు.