హైదరాబాద్

త్వరలో కొత్త రిజర్వాయర్లు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ఈసారి వేసవిలో తాగునీటి సమస్య ఉండబోదంటూ మున్సిపల్ మంత్రి ప్రకటించిన నేపథ్యంలో జలమండలి ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. శివార్లకు తాగునీటిని అందించేందుకు రూ. 1900 కోట్లతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే పూర్తయిన రిజర్వాయర్లను వచ్చే నెల మొదటి వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి ట్రయల్ రన్ నిర్వహించాలని ఆయన ఇంజనీర్లను ఆదేశించారు. ఇదే అంశంపై జలమండలి ఎండి దాన కిషోర్ శనివారం ఉన్నతాధికారులతో ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండి మాట్లాడుతూ హడ్కో ప్రాజెక్టు కింద చేపట్టిన పనుల పురోగతి, క్షేత్ర స్థాయి స్థితిగతులను సంబంధిత అధికారులను అడిగి తెల్సుకున్నారు. రిజర్వాయర్ల వారీగా జరుగుతున్న పనులపై ఆరా తీశారు. ఇప్పటికే వేసవి కాలం ప్రారంభమైనందున ప్రాజెక్టు పనులను మరింత వేగవంతం చేయాలని జలమండలి జనరల్ మేనేజర్లను, పనులు చేపట్టిన సంస్థలను ఆయన ఆదేశించారు. రిజర్వాయర్ నిర్మాణ పనులు, మరమ్మతులు వంటివి ఎట్టి పరిస్థితుల్లో నిర్ణీత సమయంలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన రిజర్వాయర్లలో ట్రయల్ రన్, పూర్తికాని రిజర్వాయర్ల పనుల పురోగతిని ఎప్పటికపుడు బోర్డు ప్రధాన కార్యాలయానికి నివేదికలుగా పంపాలని ఆదేవించారు. పనులు జరిగే ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా, వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, పనులు జరుగుతున్నట్లు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పనులకు సంబంధించి రోడ్లను తవ్వాల్సి వస్తే తవ్వి పనులు పూర్తయిన వెంటనే గుంతలను పూడ్చి వేయాలని ఆయన ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. శివార్లలోని పలు ప్రాంతాల్లో తాగునీటి పైప్‌లైన్ల విస్తరణ పనులు ఊపందుకున్న నేపథ్యంలో పనుల కారణంగా ప్రజలకు ఇబ్బందులేర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఎండి అధికారులను ఆదేశించారు.