హైదరాబాద్

బదిలీ నిధుల నిలిపివేతపై హైకోర్టులో పిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి చెందుతుందన్న అభిప్రాయానికి టిఆర్‌ఎస్ ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోందని బదిలీ నిధులు ఇవ్వకుండా అడ్డు పడుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు హై కోర్టును ఆశ్రయించాడు. సంవత్సర కాలంగా తమకు రావాల్సిన టిడి నిధులు కేటాయించడం లేదని దీని మూలంగా గ్రామ అభివృద్ధి కంటు పడి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్న యోచనతో యువజన కాంగ్రెస్ నాయకుడు పి. కార్త్తీక్‌రెడ్డి, హైదర్షాకోట్ గ్రామసర్పంచ్ పి.కృష్ణారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకుడు పి. కార్తిక్‌రెడ్డి మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానానికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయిందని ఆరోపించారు. గ్రామాల అభివృద్ధి, గ్రామ పంచాయితీల బలోపేతానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం వివిధ గ్రాంట్ల ద్వారా గ్రామ పంచాయితీలకు రావాల్సిన బదిలీ నిధులను నిలిపి వేసి గ్రామాల అభివృద్ధికి అడ్డుకట్ట వేస్తున్నారని ఆరోపించారు. గత ఏడాది కాలంగా బదిలీ నిధులు నిలిపి వేసి కనీసం 14వ ఆర్థిక సంఘ నిధులను కూడా నేరుగా విడుదల చేయకుండా వివిధ బకాయిల్లో జమ చేస్తూ అభివృద్ధి నిరోధక చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు రావాల్సిన స్టాంపు డ్యూటీ తదితర బదిలీ నిధులు సుమారు రూ. వెయ్యి కోట్లను నిలిపి వేసి స్థానిక సంస్థల అధికారాలను గుప్పిట్లో పెట్టుకున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరే ఆర్థిక నిధుల్లో 50 శాతం నిధులు రంగారెడ్డి జిల్లా నుండి సమకూర్చుకుంటున్న కనీసం గ్రామాభివృద్ధికి నిధులు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం వివక్ష చూపుతూ ప్రభుత్వ నిధులన్నీ ఉత్తర తెలంగాణ కరీంనగర్, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు తరలిస్తూ భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. మంత్రి కెటిఆర్ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించాలంటే కేంద్ర ప్రభుత్వంపై నెపం వేసే విధంగా ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలను చేపట్టకుండా మరొకరిని విమర్శించడం వారికి తగదని ఆయన హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వాన్ని తామేమి వెనకేసుకొని రావడం లేదని ఆయన అన్నారు. ఎన్నోపర్యాయాలు సర్పంచులు, ఎంపిటిసిలు ఈ విషయంలో మండల, జిల్లా పరిషత్‌లకు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేదని చివరకు అందరు కలసి ప్రభుత్వానికి నేరుగా ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో స్థానిక సంస్థల హక్కులను కాలరాస్తూ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుండటంతో హై కోర్టులో పిల్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా వారం రోజుల్లో ప్రభుత్వ స్పందించి స్థానిక సంస్థలకు రావాల్సిన బదిలీ నిధులు విడుదల చేయకపోతే సర్పంచులను, ఎంపిటిసి, జడ్పీటిసీలను ఏకం చేసి మండల, జిల్లా పరిషత్ కార్యాలయాల్లో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. అయినా స్పందించకుంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని రాజకీయాలకతీతంగా ప్రజా ప్రయోజనాల కోసం స్థానిక సంస్థలకు అందాల్సిన నిధుల కోసం తమతో కలిసి వచ్చే రాజకీయ పార్టీలకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని స్పష్టం చేశారు. ఆరు శాతం వసూలు చేసే స్టాంపు డ్యూటీలో నాలుగు శాతం నిధులు తిరిగి స్థానిక సంస్థలకు కేటాయించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఉదాహరణగా శంషాబాద్, కోకాపేట, బడంగ్‌పేట, పెద్దఅంబర్‌పేట, పంచాయితీ, నగర పంచాయితీల కనీసం ఒక్కొక్క దానికి సుమారు పది కోట్ల మేర బదిలీ నిధులు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. సుమారు వంద కోట్ల మేర జిల్లా పరిషత్‌కు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ నిధుల బదిలీ కోసం అంచెలంచెలుగా తొలి విడుతగా ఎంపిడిఒ, మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళన చేస్తామని తదుపరి కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని వారు తెలిపారు. ఈ ఉద్యమమంలో అధికార పార్టీకి చెందిన కొంత మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సైతం పరోక్షంగా తమకు మద్దతు ఇస్తున్నారని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిధులు లేక ఇబ్బందుల పడే అవకాశాలు ఉన్నాయని, గత ఏడాది వేసవి కాలంలో నీటి సరఫరా చేసిన ట్యాంకర్లకు కూడా ఇంకా నిధులు కేటాయించలేదని పలువురు సర్పంచులు ఆందోళన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జడ్పీటిసీ సభ్యులు జంగారెడ్డితో పాటు సర్పంచులు, ఎంపిటీసీలు సిద్దేశ్వర్, మంజుల యాదగిరి, వీరేందర్‌రెడ్డి, నర్సింహ్మరెడ్డి, శ్రీశైలంతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.