హైదరాబాద్

29న జనహితలో ఉగాది వేడుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: హేవళంబి ఉగాది పర్వదినోత్సవాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు క్యాంప్ ఆఫీసులోని ‘జనహిత’లో భారీ ఎత్తున, అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉగాది పండగ సందర్భంగా ఏర్పాటు చేసే వేడుకలపై ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి సింగ్ శనివారం ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. దేవాదాయ శాఖ, సాంస్కృతిక శాఖ ఉగాది వేడుకలను సంయుక్తంగా నిర్వహించాలని రమణాచారి, ఎస్‌పి సింగ్ ఆదేశించారు. ఉగాదిరోజు నాదస్వరం, సిఎంకు పూర్ణకుంభస్వాగతం, ప్రార్థనాగీతం, వేదాశ్వీరచనం, పంచాంగపఠనం, వేదపండితులకు, అర్చకులకు, ఆధ్యాత్మిక వేత్తలకు సత్కారం ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి క్యాంపుకార్యాలయంలో జరిగే ఉగాది వేడుకల సందర్భంగా బందోబస్తు, పార్కింగ్, మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఆహ్వానపత్రాల పంపిణీ తదితర అంశాలపై చర్చించారు. లైవ్‌కవరేజ్ ఏర్పాట్లు చేయాలని, పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరా తదితర అంశాలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు. ఉగాదివేడుకల్లో పాల్గొనే వివిధ శాఖలు తమకు అప్పచెప్పిన పనులు తు.చ తప్పకుండా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, జిఎడి ముఖ్యకార్యదర్శి అధర్‌సిన్సా పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణపై భన్వర్‌లాల్ సమీక్ష

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణలో స్పెషల్ సమ్మర్ రివిజన్-2017, ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ ఇన్ అర్బన్ ఏరియాల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికార భన్వర్‌లాల్ వివిధ జిల్లా కలెక్టర్లలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారులు వారి జిల్లా పరిధిలోని బూత్ లెవెల్ ఆఫీసర్లు, సూపర్‌వైజర్లును నియమించుకోవాలన్నారు. వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించి బూత్‌లెవెల్ ఏజెంట్లను నియమించుకునేందుకు నివేదికలను పంపాలన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘునందన్‌రావు మాట్లాడుతూ జిల్లాలో అన్నిపోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవెన్ ఆఫీసర్లను నియమించడం జరిగిందన్నారు. ఈ వివరాలను వెబ్‌సైట్లలో పొందుపర్చాలని చెప్పారు. ఆయా పోలింగ్ కేంద్రాలను సందర్శించి వౌలిక సదుపాయాల కోసం వివరాలను సేకరించాలని ఎమ్మార్వోలకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికార భవాని శంకర్, ఎన్నికల తహశీల్దార్లు పాల్గొన్నారు.
విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల డైరీ-2017 విడుదల
తెలంగాణ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ల డైరీ -2017ను రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం. రఘనందన్‌రావు చేతుల మీదుగా శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఎన్జ్‌ఒఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మణ్, రామ్మోహన్‌లతో పాటు వివిధ మండలాలకు చెందిన విఆర్‌ఒలు పాల్గొన్నారు.
బిసి బిల్లుకు చట్టబద్ధత హర్షణీయం
జాతీయ బిసి సంక్షేమ సంఘం
ఖైరతాబాద్, మార్చి 25: ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న బిసి బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టబద్ద కల్పించడం హర్షనీయని జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు పేరం శివనాగేశ్వరరావు అన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని పాలిస్తున్న వ్యక్తి బిసి అయినందునే ఇది సాధ్యమైందన్నారు. మోడి నేతృత్వంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి బిసి బిల్లును ఆమోదించుకునేందుకు బిసి సంఘాలు చేయని ప్రయత్నం లేదని, బిల్లుకు చట్టబద్దత కల్పించేందుకు కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రామ్‌దాస్ అతవాలే విశేషంగా కృషి చేశారని తెలిపారు. ఈ సమావేశంలో అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాణిక్ ప్రభు, మహిళా అధ్యక్షురాలు నిర్మల గౌడ్, ఇశాంత్, దయాకర్ పాల్గొన్నారు.