తెలంగాణ

ఐఏఎస్ సస్పెన్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: డ్రైవర్ నాగరాజు హత్య కేసులో నిందితుడైన ఐఏఎస్ అధికారి ధరావత్ వెంకటేశ్వరరావు సస్పెండయ్యారు. ఈనెల 17న డ్రైవర్ నాగరాజును ఐఏఎస్ కొడుకు వెంకట్ సుక్రునాయక్ ఇటుకతో తలపై బాదగా అతను మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా నాగరాజు మృతదేహం మాయం చేసేందుకు యత్నించిన ఐఏఎస్ అధికారి వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. కాగా తండ్రీ కొడుకులను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం వీరు చంచల్‌గూడ జైలులో ఉన్నారు. నిందితులిద్దరూ బెయిల్‌కోసం నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు పరిశీలించి, శనివారం బెయిల్ మంజూరుకు నిరాకరించింది.