తెలంగాణ

గడువులోగా ప్రాజెక్టులు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 25: తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులను గడువులోగా పూర్తిచేస్తామని, ఎక్కువ నిధులిచ్చి రాష్ట్భ్రావృద్ధికి తోడ్పడతామని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు హామీ ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.1729 కోట్లు ఇచ్చామన్నారు. కొత్త లైన్లకు రూ.1375 కోట్లు ఇచ్చినట్టు చెప్పారు. శనివారం హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వేదికగా పెద్దపల్లి- నిజామాబాద్ కొత్త రైల్వే లైన్‌తోపాటు, హైదరాబాద్, సికిందరాబాద్ రైల్వే స్టేషన్లలో డిజిపేను మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు. అదేవిధంగా మల్కాజ్‌గిరి రైల్వేస్టేషన్ రెండో ద్వారం, సికింద్రాబాద్‌లోని ఆళ్లగడ్డబావి వద్ద ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేష్‌ప్రభు మాట్లాడుతూ సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతో వచ్చే పదేళ్లలో రూ.41వేల కోట్లు ఆదా చేయనున్నట్టు తెలిపారు. త్వరలో మరో పది రైల్వే స్టేషన్లలో డిజిపే అమలు జరుగుతుందని ప్రకటించారు. తాను రైల్వే మంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న నాటినుంచి ఇప్పటి వరకు 15శాతం మేర ఖర్చులను నియంత్రించామని, ఈ ఏడాది 4వేల కోట్లమేర విద్యుత్ ఆదా జరిగిందన్నారు. రైల్వే స్టేషన్లలో మరిన్ని సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగ వ్యయాన్ని తగ్గించనున్నట్టు ఆయన వెల్లడించారు. రైల్వే భద్రతకు లక్ష కోట్లు కేటాయించడం జరిగిందని, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణకు ఎలాంటి ఢోకా లేదన్నారు. రైల్వేలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తానని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పనిచేస్తే సమస్యలు సునాయసంగా పరిష్కరించుకోవచ్చన్నారు. రైల్వేస్టేషన్‌లలో ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అనే్వషించాలని, భారత రైల్వే రూ.17 వేల కోట్లు నాన్ ఫెయిర్ రెవెన్యూ కలిగి ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి, కవిత, దక్షిణ మధ్య రైల్వే జిఎం వినోద్‌కుమార్ యాదవ్, అదనపు జిఎం ఎకె గుప్తా, అధికారులు పాల్గొన్నారు.

చిత్రం... పెద్దపల్లి -నిజామాబాద్ రైల్‌ను హైటెక్ సిటీ స్టేషన్ నుంచి రిమోట్ ద్వారా ప్రారంభించి పచ్చజెండా ఊపుతున్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు