హైదరాబాద్

అవినీతి, గుండాయిజానికి వ్యతిరేకంగా గళమెత్తాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 26: అవినీతి, గుండాయిజానికి వ్యతిరేకంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు గళమెత్తాల్సి ఉందని స్వరాజ్ అభియాన్ జాతీయ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అన్నారు. ఆదివారం స్వరాజ్ అభియాన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ‘ప్రజావాణి జవాబ్ దో- హిసాబ్ దో’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా ప్రశాంత్ భూషణ్, ప్రొఫెసర్ కోదండరామ్, హరగోపాల్ హాజరై ప్రసంగించారు. కామన్‌వెల్త్ కుంభకోణంతో యూపిఏ-2 ప్రభుత్వంలో కుంభకోణాలు ప్రారంభం అయ్యాయని అన్నారు. 2జి స్పెక్ట్రమ్, బొగ్గు కుంభకోణం వంటి అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయని అన్నారు. అవినీతిని అంతం చేస్తామని గద్దెనెక్కిన బిజెపి ప్రభుత్వంలో కూడా అవినీతి జరుగుతూనే ఉందని అన్నారు. న్యాయవ్యవస్థను సైతం భయపట్టే విధంగా కార్యనిర్వాహన శాఖ వ్యవహరిస్తుందని అన్నారు. రాజకీయ అవినీతి యథేచ్ఛగా జరుగుతుందని విమర్శించారు. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారీ మొత్తంలో ప్రస్తుత ప్రభుత్వం లబ్ధిపొందుతుందని అన్నారు. నోట్ల రద్దుతో దేశానికి ఏ మాత్రం లబ్ధిచేకూరలేదని, సామాన్య ప్రజలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడ్డారని చెప్పారు. వివిధ మతాలు, కులాలతో అలరారే దేశానికి భిన్నత్వమే బలమని, దానికి విఘాతం కలిగించేలా పాలన సాగడం ఆందోళన కలిగించే అంశమని అన్నారు. మతపరమైన నియంతృత్వాన్ని బలంగా ప్రతిఘటించాల్సి ఉందని పేర్కొన్నారు. రాజ్యాంగం తీవ్రమైన ప్రమాదంలో ఉందని, పౌర సమాజం దీన్ని ఎదుర్కొవాల్సి ఉందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ప్రజాస్వామిక ఉద్యమాల ద్వారా ఏర్పడ్డ తెలంగాణలో ఇలాంటి అరెస్టులు చోటుచేసుకోవడం బాధాకరమని చెప్పారు. ప్రభుత్వాలు.. ప్రజాస్వామిక హక్కులను కాలరాసే విధంగా పాలించడం దేశానికి, రాష్ట్రానికి చేటని అన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంతా కాంట్రాక్టర్ల కోసమేనని ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపించారు. ప్రశ్నించిన వారిని అభివృద్ధి నిరోధకులుగా ముద్ర వేస్తున్నారని, ప్రజాస్వామిక విలువలతో ప్రభుత్వం.. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్ని శాంతిభద్రతల కోణంలో చూడటంతోనే సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. తాము తీసుకున్న నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించ కూడదనదనే నిరంకుశ ధోరణి ఏ మాత్రం సరికాదని అన్నారు. ప్రజల కోసం పనిచేయాల్సిన వ్యవస్థలు కుల్లిపోవడం, నశించడం ప్రజలకు కష్టలను తెచ్చిపెడతాయని చెప్పారు. నిరంకుశంగా, కేంద్రీకృతమైన పాలన కొనసాగడం సమాజానికి మేలు కాదని అన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును సైతం కాలరాస్తూ కొనసాగే పాలన ఎంతో కాలం నిలవదని చెప్పారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడుతూనే ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

వాణిజ్య పన్నుల శాఖలో చట్టాల ఉల్లంఘన
ముషీరాబాద్, మార్చి 26: తెలంగాణ రాష్ట్రంలో విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అమలులో ఉన్నతాధికారుల ఉల్లంఘనల వల్ల వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడుతోందని పటిష్ట ప్రజాస్వామ్య ఉద్యమం కన్వీనర్ మోతె రఘుపతి రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలోని 91 సర్కిళ్లలో సిటిఓల పర్యవేక్షణలో తనిఖీలు చేయకుండా నామమాత్రంగా వ్వవహరిస్తున్నారని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా డిప్యూటి కమిషనర్ స్థాయి నుండి కమిషనర్ స్థాయి వరకు వ్యవస్థ లోపబూయిష్టంగా మారి పన్ను వసూళ్ల శాతం విపరీతంగా తగ్గిందని వాపోయారు.
నామమాత్రం తనిఖీల ద్వారా వచ్చే ఆదాయం మినహా ప్రత్యేక డ్రైవ్‌లు, ఇన్‌స్పెక్షన్స్, అసెస్‌మెంట్ వ్యవహారాలు కనుమరుగయ్యాయని చెప్పారు. వాస్తవానికి రాష్ట్రంలో 1లక్షా 80వేల మంది వ్యాపారులు ఉండగా కేవలం 13వేల మంది వ్యాపారుల అకౌంట్లను మాత్రమే అసెస్‌మెంట్ చేయటానికి అనుమతించటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. తనిఖీలు, అసెస్‌మెంట్లు నిర్వహణలోని వైఫల్యాలవల్ల గత మూడు సంవత్సరాలలో దాదాపు 15 వేల కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడిందని ఆరోపించారు. వాణిజ్య పన్నుల శాఖలోని ఉన్నతాధికారులపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని విజ్ఞప్తి చేశారు.