హైదరాబాద్

కాలం చెల్లిన ఇంజక్షన్లతో కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముషీరాబాద్, మార్చి 26: నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు..! అని సర్కారు దవాఖానాల దుస్థితి చాటుతూ పాడిన పాటను చికిత్స కోసం వచ్చేవారికి గుర్తుకు వచ్చినా బడుగుజీవులకు వేరే దిక్కులేదు.హైటెక్ కాలం అని చెప్పుకుంటున్నా నేటికీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీరు ఏమాత్రం మారలేదు. పాలక ప్రభుత్వాలు మారుతున్నా ప్రజల ఆరోగ్యం పరిరక్షించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. కార్పొరేట్ ఆసుప్రతులకు దీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని చెబుతున్న పాలకుల ప్రకటనలు మాటలకే పరిమితమయ్యాయ. ఇటీవల చెస్ట్ ఆసుపత్రిలో రోగికి ఆక్సిజన్ అందించటానికి సిబ్బంది 200 డబ్బులు డిమాండ్ చేశారు. చెల్లించుకోలేని స్థితిలో నిండు ప్రాణం బలయ్యింది. కాగా గాంధీ ఆసుపత్రిలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న రోగికి వీల్‌చెయిర్‌కు రూ.100 డిమాండ్ చేయటంతో చిన్న పిల్లల బొమ్మ సైకిల్‌పై రావాల్సివచ్చింది. ఈనేపథ్యంలోనే గాంధీ ఆసుపత్రిలోనే వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలయింది. ఆదివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు గడువు ముగిసిన ఇంజక్షన్ ఇవ్వడంతో కలకలం రేకెత్తించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా పలువురు చిన్నారులు అపస్మారక స్థితికి చేరారు. వివిధ జిల్లాల నుంచి వేరు వేరు అనారోగ్య కారణాలతో శనివారం గాంధీలో చేరిన చిన్నారులకు జూలై -2016తో గడువు ముగిసిన ఇంజక్షన్ ఇచ్చినట్టు గుర్తించారు. తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు. ఘటనకు బాధ్యులుగా గుర్తించిన స్ట్ఫా నర్సులను సస్పెండ్ చేయడంతోపాటు చికిత్స అందించిన వైద్యుడికి మెమో జారీ చేశారు. పూర్తి వివరాలను సేకరించడానికి ఇద్దరు సీనియర్ వైద్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేసి రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అయతే ఈ సంఘటనతో వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది. నర్సుల సస్పెన్షన్‌పై ఆందోళన నిర్వహించేందుకు గాంధీ సిబ్బంది సిద్ధమవుతున్నట్లు సమాచారం.