హైదరాబాద్

బల్దియా ఆస్తులకు దేవుడే దిక్కు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 26: నగరంలోని కోటి మంది జనాభాకు పౌరసేవలను అందించే జిహెచ్‌ఎంసి ఆస్తులకు ఇక దేవుడే దిక్కు. సిటీలో జిహెచ్‌ఎంసికి చెందిన ఎన్నో భవనాలు, ఖాళీ స్థలాలు, కమ్యూనిటీ హాళ్లు, పాతకాలం నాటి భవనాలు మొదలుకుని కమర్షియల్ కాంప్లెక్సులు సైతం ఉన్నాయి. అయితే వీటిలో ఎక్కువ శాతం ఆస్తులను గతంలోనే అధికారులు దీర్ఘకాలం వరకు లీజుకు అప్పగించారు. కనీసం లీజు గడువు ఎపుడు ముగిస్తుంది? ప్రతి నెల సక్రమంగా అద్దెలు వసూలవుతున్నాయా? అన్న విషయాన్ని సైతం అధికారులు పట్టించుకోవటం లేదు. ఎస్టేట్ విభాగం పరిధిలోకి వచ్చే ఈ మార్కెట్లలోని స్టాళ్ల నుంచి ప్రతి నెల అద్దెలను వసూలు చేసేందుకు ప్రత్యేకంగా ఇన్‌స్పెక్టర్లను నియమించినా, క్షేత్ర స్థాయిలో వారి విధి నిర్వాహణ అనేది ప్రశ్నార్దకంగా మారింది. ఈ మార్కెట్లలో చాలా వరకు స్టాళ్లను థర్డ్‌పార్టీలకు కేటాయించి, అందులో మొదటి పార్టీతో పాటు ఇన్‌స్పెక్టర్లు కూడా సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. థర్డ్‌పార్టీలకు కేటాయించటాన్ని కొందరు అధికారులు గుర్తించగా, ఎస్టేట్ విభాగానికి చెందిన సిబ్బంది అండతో వ్యాపారులు కోర్టుల్లో కేసులు వేశారు. ఇదే రకంగా రెండు పెట్రోలో పంపులు, ఓ స్పోర్ట్ కోచింగ్ సెంటర్‌లకు చెందిన స్థలాలకు సంబంధించి లీజు గడువు ముగిసినా, నేటికీ ఆ స్థలాలు బల్దియా ఆధీనంలోకి రాలేదంటే అధికారుల చిత్తశుద్ధి ఏ పాటిదో అంచన వేసుకోవచ్చు. ముషీరాబాద్‌లో 600 గజాల స్థల విస్తీర్ణంలో కృష్ణాకాలనీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. అలాగే బాగ్‌లింగంపల్లిలోని 3వేల గజాల చిల్డ్రన్ పార్కు, లాలాపేట పార్కు, ఎల్బీనగర్ సర్కిల్ పరిధిలో జిహెచ్‌ఎంసికి ఖాళీ స్థలాలను అధికారులు, రాజకీయ నేతలు కబ్జా చేసుకుని అమ్ముకున్నా, పట్టించుకోవటం లేదనే ఆరోపణ వెల్లువెత్తుతోంది. అయితే వాటిలో కొన్నింటి ఆస్తులకు సంబంధించి లీజు గడువు ముగిసినా, కనీసం వాటిని స్వాధీనం చేసుకునేందుకు కూడా అధికారులు చొరవ చూపకపోవటం వారి పనితీరుకు నిదర్శనం. ముఖ్యంగా జిహెచ్‌ఎంసికి చెందిన పలు మార్కెట్లను ఆధునీకరించి, అందులో స్టాళ్లను వ్యాపారులకు కేటాయించి అద్దెను పెంచాలన్న సంకల్పంతో వాటి అభివృద్ధి పరిచేందుకు దశాబ్దం కాలం క్రితమే అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేసినా, అందులోని కొందరు వ్యాపారులు స్టాళ్లకు సంబంధించి కోర్టులను ఆశ్రయించినట్లు తెలిసింది.
అయితే జిహెచ్‌ఎంసి పలు మురికివాడల్లో, బస్తీల్లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా అందుకు అనుకూలమైన స్థలాలు లేకపోవటం, అలాగే మురికివాడలు, బస్తీ ప్రజల ఆర్థిక పరిస్థితికి తగిన విధంగా తక్కువ ధరకే వారికి ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తెచ్చేందుకు జిహెచ్‌ఎంసి పరిధిలోని అన్ని కమ్యూనిటీ హాళ్లను స్వాధీనం చేసుకోవాలని రెండేళ్ల క్రితం అప్పటి కమిషనర్ సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేసినా, నేటికీ ఒక్క డిప్యూటీ కమిషనర్ ఒక్క కమ్యూనిటీ హాల్‌ను కూడా స్వాధీనం చేసుకోలేదు. నగరంలోని 1500 పై చిలుకు ఉన్న మురికివాడల్లోని కమ్యూనిటీ హాళ్లలో ఎక్కువ శాతం హాళ్లు స్థానిక రాజకీయ నేతల ఆధీనంలో ఉన్నాయి. వాటిని అద్దెకిచ్చి వారే అద్దెలు వసూలు చేస్తున్న స్థానిక మున్సిపల్ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్పా, వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదన్న విమర్శ వెల్లువెత్తుతోంది.
పనులెందుకు ఆగాయి?
దోమల్‌గూడలో జిహెచ్‌ఎంసికి చెందిన 40 షాపులతో 2160 చదరపు గజాల స్థలంలో మార్కెట్ నిజాం కాలం నుంచి ఉంది. ప్రస్తుతం ఈ మార్కెట్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవటంతో మొత్తం నేలమట్టం చేసి ఇక్కడ సర్కిల్ కార్యాలయాన్ని నిర్మించాలని బల్దియా నిర్ణయించింది. ఇందుకు గాను రూ. 10 కోట్లతో ఆరు అంతస్తులు నిర్మించేందుకు పరిపాలన అనుమతి కూడా ఏడాది క్రితమే వచ్చింది. టెండర్లను ఖరారు చేసి ప్రహరీగోడను నిర్మించే పనులను ప్రారంభించారు. అంతలో ఒకరొచ్చి ఈ స్థలం నాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం అతని వద్ద ఎలాంటి డాక్యుమెంట్లున్నాయన్న విషయాన్ని కూడా పరిశీలించని అధికారులు పనులను మధ్యలోనే ఆపేశారు. అధికారులు మాత్రం కోర్టు ఆర్డర్ ఉందని చెబుతున్నారు.