హైదరాబాద్

ఉస్మానియావర్సిటీకి రూ.92.19 కోట్ల లోటు బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాచారం, మార్చి 27: ఉస్మానియా యూనివర్సిటీ 2017- 2018 ఆర్థిక సంవత్సరానికి చెందిన వార్షిక బడ్జెట్‌ను సోమవారం నిర్వహించిన సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. ఓయుకు రూ 92.19కోట్ల లోటు బడ్జెట్‌ను ఆమోదించారు.
బడ్జెట్ మొత్తం ఆదాయం రూ.673.87 కోట్లుగా చూపెట్టగా వ్యయం రూ.793.15కోట్లుగా చూపెట్టారు. ప్రభుత్వం బ్లాంక్ గ్రాంట్ కింద ఇచ్చిన రూ.269.17 కోట్లు, శతాబ్ది ఉత్సవాలకు రూ.200 కోట్ల మిగిలిన నిధులు యూనివర్సిటీ సొంతగా సమాకూర్చుకోవాలని సభ్యులు తీర్మానం చేశారు. ఓయు పరిపాలన భవనంలోని సెనెట్ హాల్‌లో వైస్ చాన్స్‌లర్ ఎస్.రాంచంద్రం అధ్యక్షతన జరిగిన అకాడమిక్ సెనెట్ సమావేశంలో బడ్జెట్‌ను ప్రొఫెసర్ ఉమ చదివి వినిపించారు. ఓయు వార్షిక లోటు బడ్జెట్‌ను సెనెట్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఓయుకు ఈ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ.269.17 కోట్ల బ్లాక్ గ్రాంట్ నిధుల మంజూరు కాగా, మిగిలిన మొత్తం యూనివర్సిటీ భరించాలని సభ్యులు తీర్మానించారు. ఓయు ఎగ్జిమినేషన్ బ్రాంచ్ నిర్వాహణనకు రూ.143.96 కోట్లను ఫారిన్, రీవాల్యుయేషన్, ఆఫీస్, పిజి, ఆర్‌ఆర్, సిడిఇ డైరెక్టర్ ఆఫ్ పిజి అడ్మిషన్ నుండి నిధులను సమాకూర్చుకోవాలని సూచించారు. శతాబ్ది ఉత్సవాలకు రూ.200 కోట్ల కేటాయించగా నిర్వాహణకు ఇబ్బందులు కలుగుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓయు ప్రఖ్యాతిని దృష్టిలో పెట్టుకొని రూ.418 కోట్ల నిధులు అవసరమని సభ్యులు తీర్మానం చేసినా కనీస పట్టించుకోకుండా బడ్జెట్‌ను ఆమోదించారని అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. పిజి సెంటర్‌కు సరిపడా నిధులు ఇవ్వకపోవడంతో సెంటర్ నిర్వాహణ ప్రశ్నార్ధకంగా ఉంటుందని తెలిపారు.
లోటు బడ్జెట్‌పై అధ్యాపకుల విమర్శలు
ఉస్మానియా యూనివర్సిటీ లోటు బడ్జెట్‌తో కనీసం నిర్వాహణ సాధ్యం కాదనే వాదనలు అధ్యాపకులు నుంచి వినిపిస్తుంది. ఓయు శతాబ్ది ఉత్సవాలు నిర్వాణణకు రూ.200 కోట్ల కేటాయించడంతో పలు విద్యార్థి సంఘలు ఆందోళన చేసిన పట్టించుకోకపోవడం శోఛనీయమని పేర్కొన్నారు. కనీసం ఆర్థికవేత్తల సలహాలు సూచనలు తీసుకోకుండా ఓయు బడ్జెట్ రూపకల్పన చేయడంలో సెనెట్ సభ్యులు విఫలం చెందారని విమర్శించారు.

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

రంగారెడ్డి జెసి సుందర్ అబ్నార్

హైదరాబాద్, మార్చి 27: ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కారం చేసే దిశగా అధికారులు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ సుందర్ అబ్నార్ పేర్కొన్నారు.
సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ప్రజావాణి సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి జాయింట్ కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి సమస్యలను సాధ్యమైనంత త్వరలో పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న విజ్ఞప్తులను శాఖల వారీగా సమీక్షిస్తూ, అధికారులందరూ వారి పరిధిలోనే పరిష్కారమయ్యే సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. పరిష్కరించిన సమస్యల వివరాలను వెంటనే ప్రజావాణి పోర్టల్‌లో అప్‌లోడ్ చేయించాలని, ఫిర్యాదుదారుడికి సమాచారం అందించాలని ఆదేశించారు. ఫిర్యాదుదారుడి దరఖాస్తు అందుబాటులో లేనట్లైతే వెంటనే పోర్టల్ నుండి డౌన్‌లోడ్ చేయాలని, లేదంటే ఫోన్ ద్వారా సమాచారం అందించి మళ్లీ తెప్పించుకుని సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పేమెంట్, జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ల కేటాయింపులు, పెన్షన్‌లు, భూసమస్యలు, రుణ మంజూరు, రుణమాఫీ, ఆహార భద్రత కార్డులు తదితర అంశాలపై సుమారు 69 దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ప్రజావాణిలో జిల్లా రెవెన్యూ అధికారి భవాని శంకర్, సిపిఓ శర్మ, డిఆర్‌డిఓ ప్రశాంత్‌కుమార్ పాల్గొన్నారు.