హైదరాబాద్

లక్ష్య సాధన దిశగా వసూళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: మహానగరంలోని కోటి మంది అవసరాలకు తగిన విధంగా అభివృద్ధి పనులు, పౌరసేవల నిర్వహణ బాధ్యతలను మోస్తున్న జిహెచ్‌ఎంసి ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లను టార్గెట్ దిశగా ముమ్మరం చేసింది. గత సంవత్సరమే వెయ్యి కోట్ల పై చిలుకు వసూళ్లను చేసి, ప్రదాని నరేంద్రమోదిచే భేష్ అన్పించుకున్న జిహెచ్‌ఎంసి ఈ సారి కూడా ఆశించిన స్థాయిలో నిర్ణీత టార్గెట్‌కు తగిన విధంగానే పన్ను వసూలు చేసుకుంటుంది. ముఖ్యంగా గత నవంబర్ 8వ తేదీన కేంద్రం పెద్ద నోట్లను రద్దు చేయటంతో కరెన్సీ, చిల్లర కష్టాల నేపథ్యంలో మార్చి మాసంలో వసూళ్లు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందిన అధికారులు ఇపుడు ఆశ్చర్యపడేలా పన్ను వసూలవుతోంది. మంగళవారం వరకు సుమారు రూ. 1113 కోట్ల మేరకు పన్ను వసూలైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే ఈ ఆర్థిక సంవత్సరం తొలుత రూ. 1500 కోట్ల వరకు లక్ష్యంగా పెట్టుకున్నా, ఆ తర్వాత కుదించుకున్న టార్గెట్ ప్రకారం రూ. 1200లకు పైనే వసూలు కానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రూ. 1113 కోట్లు వసూలు కాగా, ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మిగిలిన ఉన్న మరో మూడు రోజుల్లో వంద కోట్ల వరకు పన్ను వసూలవుతుందని భావిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఆస్తిపన్ను చెల్లించే బకాయిదారులు సుమారు 13లక్షల పై చిలుకు ఉండగా, వీటిలో రూ. 1200లోపు చెల్లించే ఖాతాదారులు దాదాపు 5లక్షల 44వేల మేరకున్నారు. ఈ ఖాతాలన్నింటిని కూడా క్షేత్ర స్థాయిలో రీ సర్వే చేస్తుండటం కూడా బల్దియాకు ఒక రకంగా కలిసొచ్చిందని చెప్పవచ్చు. అంతేగాక, పెద్ద నోట్ల రద్దు కారణంగా టౌన్‌ప్లానింగ్‌కు ఎక్కువ భవన నిర్మాణ అనుమతులు కూడా రాకపోవచ్చునని భావించిన అధికారుల అంచనాలు కూడా ఈ సారి తారుమారయ్యాయి. కేవలం 13 బడా భవనాల నిర్మాణ అనుమతులతో రూ. 113 కోట్ల మేరకు ఈ ఒక్క విభాగం నుంచే ఆదాయం సమకూరటం విశేషం. ఇదిలా ఉండగా, మరికొన్ని మొండి బకాయిలను వసూలు చేసేందుకు ఆర్థిక సంవత్సరంలో మిగిలిన మూడురోజుల్లో బుధవారం ఉగాది సెలవు మినహా మిగిలిన రెండురోజుల్లో ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి విధులకు సిద్దమవుతున్నారు. అంతేగాక, వివిధ ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలు, ఆ శాఖలకు జిహెచ్‌ఎంసి చెల్లించాల్సిన మొత్తం వంటి ఖాతాలను కూడా అధికారులు సర్దుబాటు చేస్తున్నారు. అయితే గత సంవత్సరం నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా ఎల్బీ స్టేడియంను ఇరవై రోజుల పాటు వినియోగించుకున్నందున స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఏకంగా రూ. 94లక్షల అద్దెను వడ్డించింది. అయితే అంత పెద్ద మొత్తంలో అద్దెను వడ్డించటంతో జిహెచ్‌ఎంసి అధికారులు ఖంగుతిన్నారు. ఈ అద్దె మినహా మొత్తం పన్ను చెల్లించేందుకు తాము సిద్దమేనంటూ ‘సాట్స్’ సానుకూలతను వ్యక్తం చేసినా, స్టేడియంకు అద్దెగా నిర్ణయించిన రూ. 94లక్షల వివరాలు పంపాలని జిహెచ్‌ఎంసి అధికారులు ప్రతిపాదనలు పంపుతున్నారు. ఈ రకంగా జలమండలి, ఆర్టీసి ఇతరత్ర విభాగాలకు చెందిన అకౌంట్లను సెటిల్‌మెంట్లు చేయటంలో జిహెచ్‌ఎంసి అధికారులు నిమగ్నమై ఉన్నారు.