హైదరాబాద్

పురస్కారాలతో కళాకారులకు ప్రేరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలను గురువారం విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూ దనాచారి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురస్కారాలు కళాకారులకు ప్రేరణ కలిగిస్తాయని అన్నారు. తనకు సాహిత్యంపై మక్కువ వున్నా వృత్తిరీత్యా బిజీగా వుండటంతో దూరమైనానని చెప్తూ తాను రాసిన కవితను చదివారు. మానవ జీవితంలో ఎన్నో ఒడుదుడుకులు ఉంటాయని, పురస్కారం రానివారు నిరాశ చెందక మరొక ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి వైస్ చాన్సలర్ ఎస్వి సత్యనారాయణ, అధ్యక్షత వహించారు. బోధన, శిక్షణ విషయంలో ప్రజల వద్దకు తెలుగు విశ్వవిద్యాలయాన్ని తీసుకువెళ్తామని అన్నారు.
బెజవాడ పట్ట్భారామిరెడ్డి స్మారక పురస్కారం - దేవులపల్లి కృష్ణమూర్తి (సృజనాత్మక సాహిత్యం); తిక్కవరపు రామిరెడ్డి స్మారక పురస్కారం - సయ్యద్ నసీర్ అహ్మద్ (పరిశోధన); బలుసు బుచ్చి సర్వారాయుడు స్మారక పురస్కారం - పులిగడ్డ విశ్వనాథరావు (హాస్య రచన); ఇల్లిందల సీతారామారావు -సరస్వతీదేవి స్మారక పురస్కారం - హైమవతీ భీమన్న (జీవితచరిత్ర); నాళం కృష్ణారావు స్మారక పురస్కారం - జ్వలిత (ఉత్తమ రచయిత్రి); అమిలినేని లక్ష్మీరమణ స్మారక పురస్కారం - దాసరాజు రామారావు (వచన కవిత); ఏటుకూరి వెంకట నర్సయ్య స్మారక పురస్కారం - డా. నోముల సత్యనారాయణ (వివిధ ప్రక్రియలు); తాపీ ధర్మారావు స్మారక పురస్కారం - తెలకపల్లి రవి (పత్రికా రచన); శతావధాని కార్యంపూడి రాజమన్నారు స్మారక పురస్కారం - డా. పి.చెంచు సుబ్బయ్య (అవధానం); బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం స్మారక పురస్కారం - విహారి (కథ); ఆచార్య బి.అరుణకుమారి పురస్కారం - జాతశ్రీ (నవల); అబ్బూరి రామకృష్ణారావు - వరద రాజేశ్వరరావు స్మారక పురస్కారం - ఆచార్య బి.రామకృష్ణారెడ్డి (్భషాచ్ఛందస్సాహిత్య విమర్శ); బాదం సరోజాదేవి స్మారక పురస్కారం - బూర్గుల శ్రీనాథశర్మ (ఆధ్యాత్మిక సాహిత్యం); పిల్లమర్రి వేదవతి - జగన్నాథం స్మారక పురస్కారం -డా. పల్లేరు వీరాస్వామి (సాహిత్య విమర్శ); నండూరి రామకృష్ణమాచార్య స్మాకర పురస్కారం - డా. వెలుదండ సత్యనారాయణ (పద్య రచన); అంగలకుదిటి సుందరాచారి స్మారక పురస్కారం - వి.ఆర్.శర్మ (బాల సాహిత్యం); డా. కె.వి.రమణాచారి కీర్తి పురస్కారం - జి. యాదగిరి (పద్య రచన); డా. తిరుమల శ్రీనివాసాచార్య - స్వరాజ్యలక్ష్మి కీర్తి పురస్కారం - దాశరథుల బాలయ్య (తెలుగు రుబాయిలు); నాయని సుబ్బారావు స్మారక పురస్కారం - నిడమర్తి నిర్మలాదేవి (కాల్పనిక సాహిత్యం) లకు స్పీకర్ మధుసూదనాచారి పురస్కారాలను ప్రదానం చేశారు.