కృష్ణ

నోబుల్ కళాశాలలో నో-వెహికల్ డే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కల్చరల్): పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని నోబుల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. పివి అనీల అన్నారు. స్థానిక నోబుల్ కళాశాల వ్యవస్థాపకులు ఆర్‌టి నోబుల్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారిక బృందం ఆధ్వర్యంలో మంగళవారం నోబుల్ కళాశాలలో నోవెహికల్ డేను నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు కాలినడక, సైకిళ్ళపై కళాశాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. పివి అనీల మాట్లాడుతూ పర్యావరణాన్ని కపాడడానికి ప్రతి విద్యార్థి తన వంతు ప్రయత్నం చేయాలన్నారు. మహిళా సాధికారిక బృందం సభ్యులు తయారు చేసిన అనేక వస్తువులను విక్రయించి ఆ సొమ్మును పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బృందం కన్వీనర్ రత్నమేరి, కో-కన్వీనర్ షాలినీ, ఆంగ్ల శాఖాధిపతి ఎర్నేస్ట్, శాంతి పాల్గొన్నారు.

అనుమానాస్పదస్థితిలో బంగారు వ్యాపారి మృతి
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 9: పట్టణానికి చెందిన ఒక బంగారు వ్యాపారి అనుమానాస్పద స్థితిలో తన ఇంటిలో ఉరి వేసుకొని మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం జరిగింది. పట్టణ పోలీస్ స్టేషన్‌లో మృతుడి భార్య శిరీష తన భర్త మృతికి వేధింపులే కారణం అంటూ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్‌ఐ వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మృతుడి భార్య శిరీష తమ షాపును అద్దెకు తీసుకున్న వారు అద్దె చెల్లించకుండా తమపై దౌర్జన్యం చేశారని, అలానే జి సుబ్బారావు, ఎన్ కృష్ణబ్రహ్మం, జి కేశవ, ఆర్ కాంతారావు, పి తురులు తన భర్తలు వేధిస్తున్న కారణంగానే మానసిక క్షోభ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
* అసిస్టెంట్ కలెక్టర్ సలోని
జి.కొండూరు, ఫిబ్రవరి 9: మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని అసిస్టెంట్ కలెక్టర్ సలోని సిదాన ఆకాంక్షించారు. జి.కొండూరులో వెలుగు కార్యాలయంలో మంగళవారం జరిగిన మండల మహిళ సమాఖ్య సమావేశంలో ఆమె మాట్లాడుతూ వెలుగు పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. ఎప్పటికప్పుడు సమావేశాలను నిర్వహించి, తీర్మానాలు రాసుకుని అభివృద్ధిపథంలో నడవాలన్నారు. వ్యాపారాభివృద్ధికి తీసుకున్న రుణాలను సక్రమంగా చెల్లించాలన్నారు. ప్రభుత్వం నుంచి వడ్డీ రాయితీ లభిస్తుందన్నారు. వెలుగు ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మండల సమాఖ్య పనీతీరును అభినందించారు. ఎపిఎం బొలగాని రామకృష్ణ, సమాఖ్య ప్రతినిధులు, గ్రామైక్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.