హైదరాబాద్

దృష్టి మరల్చి దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 30: దృష్టి మరల్చి దోపిడీలకు పాల్పడుతున్న ఏడుగురు అంతర్రాష్ట ముఠా సభ్యులను హైదరాబాద్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 25 లక్షలు విలువచేసే రత్నాలు, రూ. 45,000లు నగదుతోపాటు ఒక పిస్టోలును స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన ధీరజ్‌సింగ్ (40) ముంబయికి చెందిన మహమ్మద్ సలీం (32) బాంద్రా(మహ)కు చెందిన అశ్వథ్ షేక్ (30) ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్ అజ్మత్ (29) ముంబయికి చెందిన మహమ్మద్ ఉమర్ (26) బీహార్‌కు చెందిన మహమ్మద్ వకార్ రాయ్ (27) వెస్ట్‌బెంగాల్‌కు చెందిన షేక్ సద్దాం (22)లను సౌత్‌జోన్ పోలీసులు, టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. ఈనెల 22న జైపూర్ (రాజస్థాన్)కు చెందిన వ్యాపారి విజయ్‌కుమార్ షా హైదరాబాద్‌లోని వ్యాపారులకు రత్నాలు సరఫరా చేసేందుకు వచ్చాడు. సిద్దిఅంబర్ బజార్‌లోని హోటల్ హరిద్వార్‌లో బస చేశారు. 23న ఉదయం అతని బిజెనెస్ పార్టనర్‌తో కలసి బేగంబజార్‌లో ఆటో ఎక్కి పత్తర్‌గట్టిలో దిగారు. చార్మినార్‌లోని జెవెల్లర్స్ షాపుల వద్దకు నడుచుకుంటూ వెళ్తుండగా, ఈ ముఠా అతణ్ని వెంబడించింది. ఆ వ్యాపారి దృష్టి మరల్చి మూడు కిలోల రత్నాలను దోచుకెళ్లింది. అదే రోజు సాయంత్రం అఫ్జల్‌గంజ్ ప్రాంతంలో వెళ్తున్న మరో వ్యక్తి దృష్టి మళ్లించి రూ. 1.37 లక్షల నగదు దోచుకెళ్లారు. బాధితులు చార్మినార్, అఫ్జల్ గంజ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు సిసిటివి ఫుటేజీలను పరిశీలించి మూడు బృందాలుగా ఏర్పడ్డారు. నగరంలోని పలు బంగారు షాపుల వద్ద నిఘా పెట్టారు. ఈనెల 29న ముఠా సభ్యులు ఆకాష్ అగర్వాల్ షాపు వద్ద వజ్రాలను అమ్మేందుకు వచ్చారు. దీంతో అక్కడే మాటువేసి ఉన్న టాస్క్ఫోర్స్ పోలీసులు స్థానిక పోలీసుల సహకారంతో దోపిడీ ముఠాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సౌత్‌జోన్ డిసిపి వి సత్యనారాయణ తెలిపారు.