హైదరాబాద్

గీత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, మార్చి 30 : రాష్ట్రంలో గీత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అఖిల భారత గౌడ సంఘం విజ్ఞప్తి చేసింది. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో సంఘం అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు మాట్లాడారు. ప్రమాదవశాత్తు చెట్ల మీద నుంచి కింద పడ్డ గీతకార్మికులకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియాను రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం అభినందనీయమని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న గౌడ కులస్థులు అభివృద్ధి చెందినప్పటికీ గ్రామాల్లో నివసించే వారి పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. విద్య, వైద్యం కోసం నగరానికి వచ్చే వారి కోసం నగరంలో వసతి గృహాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు.
కల్లు గీత పారిశ్రామిక ఆర్థిక, సహకార సంస్థను నియమించాలని, వృద్ధులైన గీత కార్మికులకు ఐదు వేలు పెన్షన్ ఇవ్వాలని, ఈత, తాటి చెట్లు ఎక్కేందుకు ఉపయోగపడే యంత్ర పరికరాలను రాయితీపై గీత కార్మికులకు అందించాలని కోరారు. అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని, బార్, వైన్స్ లైసెన్సుల్లో గీత కార్మికులకు 25 శాతం కేటాయించాలని కోరారు. అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా అంజిబాబు గౌడ్‌ను నియమించారు. సమావేశంలో మాణిక్ ప్రభు, ఇందిరా, నిశాంత్ పాల్గొన్నారు.