హైదరాబాద్

ఇక మెట్రో స్పీడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 1: నిత్యం ట్రాఫిక్ సమస్యతో సతమతమయ్యే మహానగరవాసులకు వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేలా కొనసాగుతున్న మెట్రో పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇప్పటికే కారిడార్ 1లో మియాపూర్ నుంచి సంజీవరెడ్డినగర్‌కాలనీ వరకు, అలాగే కారిడార్ 3లో నాగోల్ నుంచి బేగంపేట వరకు వేగవంతంగా సాగుతున్న ఈ మెట్రో పనులు ఇకపై నాంపల్లి, అమీర్‌పేట ప్రాంతాల్లో కూడా ఊపందుకోనున్నాయి. ఈ పనుల కోసం నాలుగేళ్ల క్రితం 2013 డిసెంబర్ మూడో వారంలో స్థల సేకరణ కోసం పలు ఆస్తులకు రెవెన్యూ అధికారులు నష్టపరిహారాన్ని నిర్ణయించారు. అయితే అప్పటికీ యజమానులు స్థలాలను అప్పగించలేదు. దీంతో ఆ తర్వాత వచ్చిన 2014 కత్త భూసేకరణ చట్టం ప్రకారం తమకు నష్టపరిహారాన్ని అందజేయాలని కోరుతూ పలు ఆస్తుల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇక్కడి ధర్మాసనం రెవెన్యూ అధికారులు స్థల సేకరణ జరిపిన నాటికి అమల్లో ఉన్న చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లింపు వర్తిస్తోందని హైకోర్టు తీర్పునివ్వటంతో, యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం, మెట్రోరైలు తరపున న్యాయవాదులు కూడా స్థల సేకరణకు అనుమతించాలని, పాత చట్టం ప్రకారమే నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని, స్థలాలను స్వాధీనం చేసుకుని పనులు చేపట్టేలా అనుమతించాలని కోరినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, మెట్రోరైలు తరపున అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ముఖుల్ రోహత్గి, జనరల్ మేనేజర్ రంజిత్‌కుమార్, తెలంగాణ అడ్వొకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డిల వాదనల అనంతరం సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలిచ్చినట్లు మెట్రోరైలు అధికారులు తెలిపారు. అంతేగాక, ఇప్పటికే సేకరణ పూర్తయిన 11 ఆస్తులకు చెందిన స్థలాలను రాష్ట్ర ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని తుది తీర్పులో సుప్రీం పేర్కొన్నట్లు, ఈ తీర్పుతో ఇప్పటి వరకు స్థల సేకరణకు న్యాయపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని, త్వరలోనే నాంపల్లి, అమీర్‌పేట ప్రాంతాల్లో కూడా మెట్రోరైలు పనులు ఊపందుకుంటాయని మెట్రోరైలు ఎండి డా.ఎన్వీఎస్‌రెడ్డి వ్యాఖ్యానించారు.