హైదరాబాద్

నవరాత్రులలో చిన్నారుల గానామృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 2: హేమలంబ నామ సంవత్సరం ఉగాది పర్వదినం మొదలు శ్రీరామనవమి వరకు జరిగే తొమ్మిది రోజుల వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం తొమ్మిది మంది చిన్నారులు శాస్ర్తియ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వసంత రాగంలో రూపక తాళంలో ‘సీతమ్మ మాయమ్మ.. శ్రీరాముడు మాకు తండ్రి..’ అనే కీర్తనతో కార్యక్రమం ప్రారంభించారు. ఈ కీర్తనలో అనుపల్లవిలో ‘వాతాత్మజ సౌమిత్రి..’ అంటూ చిట్టస్వరాలతో ఆరోహణ అవరోహణలతో చిన్నారులు రమ్యంగా ఆలపించారు. హిందోళ రాగంలో ఆది తాళంలో మరొక త్యాగరాజకీర్తన ‘సామజవర గమన..’ అనే కీర్తనలో ‘సాదుహృత్ సార సాబ్జపాలకా..’ అంటూ సాహిత్యాన్ని రిపీట్ చేస్తూ మధ్యమధ్యలో స్వరాలను పలుకుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. శ్రీరాగంలో ‘ఎందరో మహానుభావులు అందరికీ వందనం..’ అనే పంచరత్న కీర్తనను సుమారు నలబైదు నిమిషాలు ఆలపించారు. ఈ కీర్తనలో ‘పతితపావనుడనే పరాత్పరుని గురించి..’ అంటూ ఆ తొమ్మిది మంది చిన్నారులు కళ్యాణి, రీనా, లలితారావు, సునీతారెడ్డి, ముంతాజ్, లహరి, శ్రీవాణిశర్మ, గౌరీకుమారి, సిహెచ్ గాయత్రి రావు హృద్యంగా గానం చేశారు. కార్యక్రమంలో మొత్తం తొమ్మిది కీర్తనలు ఆలపించారు. ఎనిమిది, తొమ్మిది తరగతులు చదువుతున్న చిన్నారులు ఐదు సంవత్సరాలుగా సంగీతం నేర్చుకుంటున్నామని చెప్పారు. శ్రీకృష్ణ నాట్య మండలి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న విశ్రాంత ఐఎఎస్ చంద్రశేఖర్‌రావు.. చిన్నారులకు జ్ఞాపికలు ప్రదానం చేశారు.
గురుపరంపర వాగ్గేయకార వైభవం
హైదరాబాద్, ఏప్రిల్ 2: సద్గురు శ్రీత్యాగరాజ స్వామి తన పంచరత్నలలో ఎందరో మహానుభావులు అందరికీ వందనం అన్నట్లుగా సంగీత నృత్య కళాప్రియుల కోసం అవతరించిన ‘గురుపరంపర’ సంస్థ పంచమ వార్షికోత్సవం సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న వాగ్గేయకార వైభవంలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జరిగిన సంగీత కళారాధన వీనుల విందుగా సాగింది. సాయంత్రం జరిగిన ప్రధాన కచేరీలో డాక్టర్ పంతుల రమ ‘వేణుగాన లోలుడు..’ అనే కీర్తనను ఆలాపన చేసి హృద్యంగా ఆలపించారు. తొలుత ‘నా మనసు విడరాదా..’ అనే త్యాగరాజకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎంఎస్‌ఎన్ మూర్తి వయొలెన్‌తో, డిఎస్‌ఆర్ మూర్తి మృదంగంతో సహకరించారు. మధ్యాహ్నం జరిగిన కార్యక్రమంలో కాంతి స్వరూప్ తన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ధన్యాసి రాగంలో ‘శ్యామసుందరాంగ..’ అనే కీర్తన తరువాత పంతువరాళి రాగాన్ని ఆలాపన చేసి ‘రఘువరా..’ అనే కీర్తనలో చిట్ట స్వరాలను మధురంగా పలికారు. అనంతరం కాపి రాగంలో ‘పాహి పరమాత్మ...’ అనే కీర్తనను ఆలపించారు. ఉదయం జరిగిన కార్యక్రమంలో డి.శిరీష, సుబ్బలక్ష్మి, లలిత, అత్తిలి సిస్టర్స్, మాధవీలత, మంజులత, భాస్కర ఆదిత్య, శ్రీనివాసాచారీలు త్యాగరాజస్వామి కీర్తనలు ఆలపించారు. ఆంధ్రా బ్యాంక్ డిజిఎం త్రినాథ శ్రీ్ధర్ ముఖ్యఅతిథిగా పాల్గొనగా తొలుత సంస్థ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌కె వెంకటాచారి స్వాగతం పలుకగా కార్యదర్శి వి.రాజేశ్వరి కార్యక్రమాన్ని నిర్వహించారు.