హైదరాబాద్

పెళ్లయిన మర్నాడే తలాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 4: దేశ వ్యాప్తంగా తలాక్‌పై విస్తృతంగా చర్చ జరుగుతుండడం, మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో పెళ్లయిన మరుసటి రోజే కనిపించకుండా పోయి పోస్టులో తలాక్.. తలాక్.. తలాక్ అని ఉత్తరం రాసి భార్యతో విడాకులు తీసుకున్న ఉదంతమిది. హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన మహమ్మద్ హనీఫ్ మార్చి 10న యాకుత్‌పుర, తలాబ్‌కట్టకు చెందిన ఫర్హీన్ బేగంను వివాహం చేసుకున్నాడు. అప్పటికే అతనికి పెళ్లై ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు మగ బిడ్డలేడని ఫర్హీన్ బేగంను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచాడు. కాగా పెళ్లి చేసుకున్న రోజునే కూకట్‌పల్లిలో ఓ అద్దెగదిలో కాపురం పెట్టాడు. రాత్రి అక్కడే ఉన్న హనీఫ్ మరుసటి రోజు తెల్లవారుజాముమ భార్యకు చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె ఫోన్‌చేసి అడగ్గా తనకు ఆరోగ్యం బాగోలేదని సమాధానం ఇచ్చాడు. ఒంటరిగా ఉన్న భార్యను తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాలని సూచించాడు. దీంతో ఫర్హీనా బేగంతో ఆందోళనకు గురై అత్తారింటికి వెళ్లడంతో హనీఫ్‌కు ముందే పెళ్లి అయిన విషయం బయట పడింది. అదే విషయాన్ని భర్తను గట్టిగా నిలదీసింది. దీంతో ఆ రోజు నుంచి హనీఫ్ ఇంటికి రావడం మానేశాడు. మరో వైపు ఫోన్ ద్వారా వేధింపులు మొదలయ్యాయి. దీంతో హనీఫ్ తనకు రాసిన లేఖను తీసుకుని బాధితురాలు భవానీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. భార్య,పిల్లలు ఉండగానే మరో పెళ్లి చేసుకొని మోసం చేసిన హనీఫ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.

కింది స్థాయి ఉద్యోగిపై దాడి..
అసిస్టెంట్ ఇంజనీర్‌పై కేసు
ఖైరతాబాద్, ఏప్రిల్ 4: అకారణంగా కింది స్థాయి ఉద్యోగిపై దాడి చేసిన ఎఇపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. నిమ్స్ ఆసుపత్రిలో సివిల్ విభాగంలో ఎఇగా పనిచేసే కృష్ణారావు మంగళవారం ఉదయం అదే విభాగంలో పనిచేస్తున్న జాని బాషాపై తీవ్ర పదజాలంతో దూషిస్తూ దాడి చేశాడు. వెంటనే బాధితుడు, నిమ్స్ ఉద్యోగులంతా కలిసి పంజాగుట్ట స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయిన కృష్ణారావు ప్రవర్తనలో మార్పు రాలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్‌ను కలిసి విన్నవిస్తామని చెప్పారు.