హైదరాబాద్

హైదరా‘బాద్‌షా’ ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 10: కొద్దిరోజుల క్రితం వరకు గ్రేటర్ బరిలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠగా మారగా, ఇపుడు మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలు ఎవరికి దక్కుతాయన్న ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది. బొంతు రామ్మోహనే మేయర్ అభ్యర్థి అని వార్తలొచ్చినా చివరిక్షణలో మార్పులు జరగవచ్చునని భావిస్తున్నారు. గురువారం ఉదయం పదకొండు గంటలకు జిహెచ్‌ఎంసి కౌన్సిల్ హాల్‌లో జరగనున్న మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల ఎన్నిక కోసం మొత్తం 217 మంది ప్రజాప్రతినిధులు ఓటర్లుగా పాల్గొననున్నారు. వీరంత పదకొండు గంటల కల్లా కౌన్సిల్ హాల్‌కు హజరుకావాలని ఇప్పటికే ప్రిసైడింగ్ ఆఫీసర్, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జ వారికి నోటీసులు కూడా పంపించారు. వీరిలో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కూడిన 67 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యుల హోదాలో తమ ఓటు హక్కును వినియోగించనుకోనున్నారు. కానీ పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో టిడిపి, కాంగ్రెస్ పార్టీలు ఘోర అపజయం పాలు కావటంతో పాటు ఆ పార్టీల్లో ఒకదానికి ఒకే ఒక్క స్థానం, మరో పార్టీకి రెండు స్థానాలను మాత్రమే దక్కటంతో ఆ పార్టీకి చెందిన ఎక్స్ ఆఫీషియో సభ్యులు ఓటింగ్‌కు దూరంగా ఉండే అవకాశముంది. ఇక బిజెపి నుంచి కూడా కేవలం నలుగురు మాత్రమే గెలవటంతో ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కూడా ఓటింగ్ హజరయ్యే అవకాశాలు అంతంతమాత్రంగానే కన్పిస్తున్నాయి. దీంతో పాటు 44 స్థానాలను కైవసం చేసుకున్న మజ్లిస్ పార్టీ ఈ ఎన్నికకు హాజరుకావాలని భావిస్తున్నట్లు బుధవారం రాత్రి పార్టీ వర్గాల నుంచి తెలిసిన విశ్వసనీయ సమాచారం. గ్రేటర్ ఎన్నికలకు ముందు నుంచే టిఆర్‌ఎస్‌తో ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకుంటున్న ఆ పార్టీ ఓటింగ్ పాల్గొని, ఎన్నికను గౌరవించాలని, ఆ తర్వాత సర్దుబాట్లు ఏమైనా ఉంటే స్థారుూ సంఘం నియామకల్లో చూసుకోవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.
సరైన వారికే సమున్నత స్థానం
గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవీని చర్లపల్లి డివిజన్ కార్పొరేటర్‌గా గెలిచిన బొంతు రామ్మోహన్‌కు, డిప్యూటీ మేయర్ పదవికి బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్ధిన్ పేర్లను ఆ పార్టీ ఖరారు చేసినట్లు దాదాపు ఖరారైనట్టేనని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి నారాయణఖేడ్ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థుల పేర్లు ప్రకటనలో ఆలస్యం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన వీరిద్దరికీ గ్రేటర్ పీఠాలను కేటాయించటం పట్ల పార్టీలోనే గాక, తెలంగాణవాదుల్లోని ఒకింత హర్షం వ్యక్తమైంది. కానీ మేయర్ పదవి కోసం పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు కుమార్తె గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ కోసం సోమాజిగూడ కార్పొరేటర్ అత్తలూరి విజయలక్ష్మి కూడా ప్రయత్నాలు చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ల పదవుల కోసం జోరుగా విన్పిస్తున్న బొంతు రామ్మోహన్, బాబా ఫసీయుద్దిన్‌లిరిద్దరూ కూడా నగరంలో తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించిన వారు కావటం విశేషం. అంతేగాక, వీరిద్దరు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కావటం విశేషం. ఆర్థికంగా పెద్దగా స్తోమత లేకపోయినా, ఉద్యమంలో ఎంతో చరుకైన పాత్రను పోషించిన బాబా ఫసీయుద్దీన్‌కు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయించటమే సముచితమని ఆ పార్టీ వర్గాలు సైతం వ్యాఖ్యానిస్తున్నాయి. కాగా, జిహెచ్‌ఎంసిలో కూడా ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించి, అందులో ఒక మహిళకు అవకాశం కల్పించాలని సర్కారు యోచించినా, ప్రస్తుతమున్న చట్టం ఇద్దరు డిప్యూటీ మేయర్లను నియమించేందుకు అనుకూలంగా లేదని, ఒక వేళ సర్కారు నియమించాలని భావిస్తే శాసనసభలో చట్ట సవరణ గానీ, అర్డినెన్స్ గానీ తీసుకురావాల్సి ఉందని, జీవో ద్వారా ఇది సాధ్యం కాదని అంటున్నారు.