హైదరాబాద్

వచ్చే ఎన్నికల్లో విజయం మాదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 7: వచ్చే ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని, అందుకు కాంగ్రెస్ కార్యకర్తలంతా కంకణబద్దులు కావాలని తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం హైదరాబాద్, సికిందరాబాద్ జంటనగరాల కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల్లో నూతనోత్తేజాన్ని నింపేందుకు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన అంబేద్కర్ విగ్రహం వద్ద సత్యగ్రహ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. గత ఎన్నికల్లో జరిగిన ఓటమి రానున్న ఎన్నికల్లో జరగకుండా, పార్టీ గెలుపే ప్రధాన ధ్యేయంగా పనిచేయాలన్నారు. ముఖ్యంగా హైదరాబాద్, సికిందరాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల్లోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని కార్యకర్తలంతా స్థానికంగా నెలకొన్న ప్రజాసమస్యలపై డోర్ టు డోర్ ప్రచారం చేసి, ప్రజలను చైతన్యవంతులను చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా కాంగ్రెహ్ హయంలో నగరంలో, శివార్లలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యవస్థపరంగా, క్యాడర్ పరంగా ఉన్న బలం మేరే ఇతర పార్టీలకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజల వివిధ రకాల సమస్యలపై తమ అభిప్రాయాలను తెలిపేందుకు గళాన్ని విన్పించేందుకు వేదికైన ఇందిరాపార్కు ధర్నాచౌక్‌ను తరలించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము ప్రజాస్వామ్య బద్దంగా తీవ్రంగా ఎదుర్కొనున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, అయినా భయపడేది లేదని, అవసరమైతే తామే జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్నిచ్చినందుకే నేడు కెసిఆర్ కుటుంబ సభ్యులు అధికారాన్ని అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఆలిండియా కాంగ్రెస్ కార్యదర్శి ఆర్‌సి. కుంతియా మాట్లాడుతూ పిసిసి చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంటు భట్టివిక్రమార్కల సారథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ఐఏసిసి విశ్వసిస్తోందని వివరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్ యాదవ్, బలరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.