హైదరాబాద్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 8: చాంద్రాయణగుట్ట ఇహెచ్‌టి సబ్‌స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ ఇహెచ్‌టి సబ్‌స్టేషన్ వరకు ఉన్న 132 కెవి కండక్టర్ మార్పిడి పనుల వల్ల ఈ నెల 9వ తేదీ పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని ఎస్‌పిడిసిటిఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. 9వ తేదీ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గోల్కొండ, కొండాపూర్, రోడ్‌నెంబర్7 బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఇందిరాగాంధీ సొసైటీ, అయ్యప్ప సొసైటీ, నిమ్స్, హైటెక్ సిటీ, బంజారాహిల్స్ రోడ్ నెం.22, అపోలో హాస్పిటల్, కాటేదాన్, కొత్తగూడ, రవీంద్రనగర్, బిఎన్‌ఆర్ హిల్స్, గగన్‌పహాడ్, మాధాపూర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పేర్కొంది.

రంగారెడ్డి జిల్లా
బిజెపి ఓబిసి సెల్ కమిటీ

హైదరాబాద్, ఏప్రిల్ 8: భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా ఓబిసి సెల్ పూర్తిస్థాయి కమిటీని శనివారం జిల్లా అధ్యక్షుడు అంభోజు జగదీష్ యాదవ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడి వెనుకబడిన తరగతులు అభివృద్ధి, సంక్షేమానికి పేద పీట వేస్తున్నారని అన్నారు. జాతీయస్థాయి రాజ్యాంగబద్ధ అధికారాలతో కూడిన బిసి కమిషన్‌ను ప్రకటించడంపట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి లచ్చిరెడ్డి, కొప్పు బాషా, జిల్లా మీడియా సెల్ కన్వీనర్ రాచూరి రాజశేఖర్ పాల్గొన్నారు.