హైదరాబాద్

సంక్షోభం నుంచి బల్దియాకు ఉపశమనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: ఆర్థ్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న జిహెచ్‌ఎంసి వసూళ్లకు సంబంధించి మంత్రి కెటిఆర్ ఉపదేశించిన మంత్రం సత్ఫలితాలిస్తోంది. ముఖ్యంగా జిహెచ్‌ఎంసి అంత్గత ఆదాయ వనరులను పెంపొందించుకోవాలని, అపుడే ప్రజలకు కావల్సిన వౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టగలమని మంత్రి కెటిఆర్ ఆదేశాలు ఆశించిన స్థాయిలో అమలవుతున్నాయి. ఫలితంగా జిహెచ్‌ఎంసి ఆర్థిక సంక్షోభం నుంచి కాస్త ఊరట పొందుతోంది. నవంబర్ 8న కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు ప్రభావం అన్ని రంగాలపై పడినా, జిహెచ్‌ఎంసి వసూళ్లపై అంతంతమాత్రమేనని చెప్పవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నిర్మాణ రంగంపై ఈ నిర్ణయం చాలా ప్రభావం చూపుతోందని అధికారులు, నిపుణులు భావించినా, వారి అంచనాలు తలకిందులై పలు బడా సంస్థల భవనాలకు నిర్మాణ అనుమతులను జారీ చేసి జిహెచ్‌ఎంసి ఆశించిన స్థాయిలో రూ. 500 కోట్ల పై చిలుకు ఆదాయాన్ని సమకూర్చుకుంది. దీంతో పాటు ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను కూడా లక్ష్యానికి తగిన విధంగా వసూలు చేసుకోవటంతో ఇపుడు జిహెచ్‌ఎంసి ఖజానా కాసులతో గలగలమంటోంది. గత ఆర్థిక సంవత్సరం 2016-17లో వెయ్యి కోట్లు కూడా వసూలు కావటం కష్టమేనని భావించగా, ఏకంగా రూ. 1270 కోట్ల మేరకు రికార్డు స్థాయిలో పన్ను వసూలైంది. ముఖ్యంగా ఆస్తిపన్ను విధిపుంలో ఉన్న లోపాలను సరి చేయటంతో పాటు పన్ను చెల్లింపు విధానాలను మరింత సరళీకృతం చేయటం వంటి చర్యలతోనే వసూళ్లు గణనీయంగా పెరిగాయని చెప్పవచ్చు. దశాబ్దం కాలంగా పైసా పన్ను పెంచకుండా ప్రతి సంవత్సరం అదనంగా కనీసం వంద కోట్లు వసూలు చేసుకోటం జిహెచ్‌ఎంసి ప్రత్యేకం. అంతేగాక, అంతర్గత ఆదాయ వనరులను పెంపొందించుకోవటం, భారీగా పన్ను వసూలు చేసుకోవటంలో జిహెచ్‌ఎంసి దేశంలోనే మొట్టమొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే నివేదికలోనూ పన్నుల వసూళ్లలో జిహెచ్‌ఎంసి సాధించిన గణనీయమైన పురోగతి సాధించింది. గత సంవత్సరం జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా రూ. 1200లోపు ఆస్తిపన్ను చెల్లించే వారికి రూ. 101కు కుదిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నిజమైన అర్హులకు లబ్ధి చేకూర్చి జిహెచ్‌ఎంసి ఆదాయం పెరిగిందని చెప్పవచ్చు.
హైదరాబాద్ నగరంలో లక్షల సంఖ్యలో వ్యాపార సంస్థలున్నా, వీటిలో సగానికి పైగా సంస్థలకు జిహెచ్‌ఎంసి ట్రేడ్ లైసెన్సుల్లేవు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు అలాంటి వాటిని కూడా ట్రేడ్ లైసెన్సుల పరిధిలోకి తీసుకువచ్చేందుకు చేసిన కృషి కారణంగా గత ఆర్థిక సంవత్సరం ట్రేడ్ వసూళ్లు కూడా గణనీయంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 76వేల 622 ట్రేడర్ల నుచి రూ. 41 కోట్ల 81లక్షల 87వేలు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం 2015-16లో కేవలం 42వేల 836 ట్రేడర్ల నుంచి రూ. 28కోట్ల 50లక్షల 33వేలు, అలాగే 2016-17లో రూ. 13 కోట్ల 31లక్షల 54వేలు అధికంగా వసూలయ్యియి. ప్రస్తుతం పదిరోజులు పూర్తి చేసుకున్న వర్తమాన ఆర్థిక సంవత్సరం 2017-18లో ఇప్పటికే ట్రేడ్ లైసెన్సు రెన్యువల్ కింద రూ. కోటి 82లక్షల వసూలు చేశారు.
10 రోజుల్లోనే రూ. 31 కోట్లు
వర్తమాన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను చెల్లింపులు ఈ నెలాఖరులోపు చెల్లించే వారికి అయిదు శాతం రాయితీ ఇస్తూ జిహెచ్‌ఎంసి అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ స్కీం కూడా చక్కటి స్పందన వస్తోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన పదిరోజులే గడిచినా, ఇప్పటి వరకు రూ. 31.34 కోట్ల మేరకు ఆస్తిపన్ను వసూలైంది. గత సంవత్సరం ఇదే తేదీ నాటి వసూళ్లను గమనిస్తే కేవలం రూ. 3.62 కోట్లు మాత్రమే. సోమవారం ఒక్కరోజే రూ. 8.82 కోట్లు వసూలు చేశారు. ఇందులో 7960 మంది సిటిజన్ సర్వీసు సెంటర్‌లో, 5409 మంది ఆన్‌లైన్ ద్వారా, 1919 మంది బకాయిదారులు బిల్ కలెక్టర్ ద్వారా పన్ను చెల్లింపు జరిపినట్లు జిహెచ్‌ఎంసి అధికారులు తెలిపారు.