హైదరాబాద్

హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 10: బజరంగ్‌దళ్ భాగ్యనగర్ విభాగం ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. ముఖ్యంగా శ్రీ వీర హనుమాన్ విజయయాత్ర పేరిట బైక్‌ర్యాలీతో మంగళవారం మధ్యాహ్నం నిర్వహించనున్న శోభాయాత్రకు గౌలీగూడలో సర్వం సిద్ధమైంది. గౌలీగూడలోని రాంమందిరం నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర వివిధ ప్రాంతాల మీదుగా వైస్రాయ్ చౌరస్తా, బైబిల్ హౌజ్, ప్యారడైజ్‌ల మీదుగా సికిందరాబాద్ తాడ్‌బంద్ శ్రీ హనుమాన్ దేవాలయం వరకు కొనసాగనుంది. యాత్ర కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేసి, ఆంక్షలను అమలు చేయనున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ఇప్పటికే నగర పోలీసు శాఖ కోరింది. లక్షలాది మంది పాల్గొనే ఈ శోభయాత్రకు పోలీసులు కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
అడుగడుగునా నిఘాను ఏర్పాటు చేయనున్నారు. ఈ యాత్రకు మహారాష్ట్ర శ్రీనాథ పీఠానికి చెందిన జితేంద్రనాథ్‌జీ మహారాజ్, బజరంగ్‌దళ్ అఖిల భారతీయ అధ్యక్షులు మనోజ్ వర్మలు ముఖ్య అతిధిగా హజరై ప్రారంభించనున్నారు. గంటల పాటు కొనసాగే ఈ యాత్ర తాడ్‌బంద్ హనుమాన్ దేవాలయం చేరుకున్న తర్వాత సిక్‌విలేజ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో ముగింపు సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా పలువురు విశ్వహిందూ పరిషత్, బజరంగ్‌దళ్ ప్రముఖులు ముగింపుసభకు హాజరైన భక్త జన సందోహాన్ని, యువకులనుద్దేశించి ప్రసంగాలు చేయనున్నారు.

టిప్ కోసం వెయిటర్ల
మధ్య ఘర్షణ
ఒకరి మృతి

హైదరాబాద్, సైదాబాద్, ఏప్రిల్ 10: ఓ కస్టమర్ ఇచ్చిన టిప్ కోసం ఇద్దరు వెయిటర్ల మధ్య జరిగిన గొడవ ఒకరి ప్రాణాలు బలిగొంది. హైదరాబాద్ పాతబస్తీకి బీబీనగర్‌లోని స్పైసీ బావర్చిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రూ. 30లో వాటా కావాలని ఒకరు, ఇచ్చేది లేదని మరొకరు..వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య పరస్పర వాగ్గివాదం ఘర్షణకు దారితీసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కమలేష్, రాజు ఇద్దరూ స్పైసీ బావర్చిలో వెయిటర్లుగా పనిచేస్తున్నారు. ఈ గొడవలో కమలేష్ రాజును బలంగా కొట్టడంతో అతను కిందపడి మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
రూ.314కోట్లతో భగీరథ పనులు
మోమిన్‌పేట, ఏప్రిల్ 10: వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు రూ.314 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజీవరావు పేర్కొన్నారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మండలం వివిధ అభివృద్ధి పనులకు రూ.50కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిని 30 పడకలకి పెంచుతూ రూ.7కోట్లు మంజూరు చేశారని చెప్పారు. రాగులపల్లి నుంచి కోల్కుంద వరకు రోడ్డు విస్తరణకు రూ.1.67లక్షలు కేటాయించారని తెలిపారు. కార్యక్రమంలో వికారాబాద్ జడ్పీటిసి ముత్తహర్ షరీఫ్, మండల పార్టీ అధ్యక్షుడు సమద్, మండల ఉపాధ్యక్షులు అమరేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, నాయకులు నరోత్తమ్‌రెడ్డి, రహి, మహంత్‌స్వామి, విఠల్, వెంకటరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, నర్సింలు పాల్గొన్నారు.

హోమియో వైద్యానికి ప్రాచుర్యం

హోమియో మెడికల్ కళాశాల అభివృద్ధికి కృషి
వైద్య పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సత్వర చర్యలు
ఆడిటోరియం నిర్మాణానికి పూర్తి సహకారం
ప్రపంచ హోమియోపతి డేలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి

ఉప్పల్, ఏప్రిల్ 10: రాష్ట్రంలోని హోమియో ఆసుపత్రులను బలోపేతం చేయడంతో పాటు హోమియో వైద్యానికి ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి అన్నారు. ప్రపంచ హోమియోపతి డే సందర్భంగా రామంతాపూర్‌లోని జయసూర్య పొట్టి శ్రీరాములు హోమియో కళాశాల నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు నిర్వహించిన హోమియో అవగాహన రన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కళాశాల ఆవరణలో హోమియోపతి పితామహుడు డాక్టర్ సామ్యూల్ హానిమన్ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేణుగోపాలచారి, ఎంపి మల్లారెడ్డి, ఎమ్మెల్యే ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్, హోం గ్రూపు ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ డాక్టర్ జె.రామేశ్వర్ రావు, ఆయూష్ డైరెక్టర్ డాక్టర్ ఎ.రాజేందర్‌రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.లింగరాజుతో కలిసి ఆవిష్కరించారు. హోమియోపతి ఆసుపత్రిలో రోగులను పరిశీలించి సౌకర్యాలను అడిగి తెలుసుకుని వారికి దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయుష్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని, ఈ ఏడాది బడ్జెట్‌లో ఆయుష్ విభాగానికి అధిక నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. అధునాతన వైద్య పరీక్ష కేంద్రం ఏర్పాటుకు సత్వర చర్యలు తీసుకుంటానని, ఫార్మసీ మందుల తయారీ యూనిట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కళాశాలలో అవసరమైన సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందులో భాగంగానే భవన నిర్మాణ విస్తరణ కోసం రూ.2కోట్లు కేటాయించామని అన్నారు. ఆడిటోరియం నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. త్వరలోనే వైద్యుల నియామాకాలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి మాట్లాడుతూ హోమియో మెడికల్ కళాశాల అభివృద్ధికి ఎంపి కోటా నిధులను ఇస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ప్రభాకర్ మాట్లాడుతూ హెచ్‌ఐవి పాజిటివ్ కేసులకు రామంతాపూర్ హోమియో మెడికల్ వైద్యులు కనుగొన్న మందు బాగా పని చేస్తుండటంతో దేశం నలుమూలల నుంచి ప్రజలు తరలి వస్తున్నారని, వారి కోసం స్వచ్ఛ టాయిలెట్లు ఏర్పాటు చేస్తానని తెలిపారు. హోమియో మెడికల్ కళాశాల గోల్డెన్ ఉత్సవాల సందర్భంగా కొత్త ఆడిటోరియం నిర్మాణానికి జూపల్లి రాజరామేశ్వర్ రూ.50లక్షల విరాళం ప్రకటించారు. కార్యక్రమంలో హోమియోపతి డే సెలబ్రేషన్ కమిటీ సభ్యులు ఎన్.శ్రీనివాసరావు, హోమియో మెడికల్ కళాశాల పూర్వ వైద్యులు పాల్గొన్నారు.