హైదరాబాద్

కుంటిసాకులు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు కేటాయించి చేపట్టిన పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి రచేయాలని, కుంటి సాకులతో మభ్యపెట్టరాదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి డా.పి.మహేందర్‌రెడ్డి అధికారులను హెచ్చరించారు. మిషన్ భగీరధ పథకంలో భాగంగా చేపట్టిన పనులను ఈ సంవత్సరం డిసెంబర్‌నాటికల్లా పూర్తి చేసి ఇంటింటిటికీ కుళాయిల ద్వారా మంచినీరు అందించాలని ఆయన ఆదేశించారు. గురువారం సచివాలయంలో రంగారెడ్డి, మేడ్చెల్, వికారాబాద్ జిల్లా కలెక్టర్లతో కలిసి ఆయన ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులతో మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ రోడ్ల పనులపై సమీక్షించారు. ప్రధానంగా మిషన్ భగీరధ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ప్రధాన పైప్ లైన్ పనులు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. మిషన్ కాకతీయ పనులలో భాగంగా ఫేజ్-1, ఫేజ్-2 ద్వారా చేపట్టిన కార్యక్రమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో చెరువుల్లో నీరు వుండదని, ఈ సమయంలోనే పనులు వేగవంతం చేసి పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. మోయినాబాద్, చేవెళ్ల రోడ్లు పూర్తిగా పాడైపోయి ప్రయాణం చేసేందుకు ప్రజలకు కష్టంగా వున్న నేపథ్యంలో అధికారులు నాణ్యతా ప్రమాణాలతో కూడిన మరమ్మతులను వెంటనే చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లాలో మిషన్ భగీరధ పనులు రెండు సెగ్మెంట్‌లుగా ఆరు నియోజకవర్గాలలో 22 మండలాలు, ఔటర్ రింగ్‌రోడ్ బయటవైపు వున్న పనులు చేపట్టడం జరిగిందని కలెక్టర్ రఘునందన్‌రావు తెలిపారు. ప్రధాన పైప్‌లైన్ పనులు డిసెంబర్ నాటికి పూర్తి చేసి గ్రామాల్లో పైప్‌లైన్లు వేసి జూన్ 2018 నాటికి పనులు పూర్తి చేసి ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీరు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు ఆయన తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన ఫేజ్-1లో 90 శాతం, ఫేజ్-2లో 437 పనుల్లో 200 పనులు పూర్తి చేయడం జరిగిందని వివరించారు. మిగిలిన పనులు జూన్ వరకు పూర్తి చేస్తామని, ఫేజ్-3లో 171 పనులకు గాను 80 పనులు గ్రౌండింగ్ దిశలో ఉన్నాయని వివరించారు. మోయినాబాద్, చేవెళ్ల రోడ్ల మరమ్మతు పనులను నాలుగు నెలల్లో పూర్తి చేస్తామని ఆర్ అండ్ బి అధికారులు వివరించారు. మిషన్ భగీరధ పథకంలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో 1800 కోట్లతో మెయిన్ గ్రిడ్ పనులు చేపట్టగా మూడు డబ్ల్యుటిపిల పరిధిలో 3,500 కిలోమీటర్ల పైప్‌లైన్లు సెప్టెంబర్ నెలాఖరుకు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. ముచ్చెర్లలోని డబ్ల్యుటిపి పనులు 72 శాతం పూర్తి కాగా షాబాద్ మండలం అంతారంలోని డబ్లుయటిపి పనులు 48 శాతం మాత్రమే పూర్తయినట్టు వివరించారు. పరిగిలోని రాఘవాపూర్‌లో 66 శాతం పనులు పూర్తి అవడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. ఎలాంటి సమస్యలనైనా తన దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కరించేందుకు సహకరిస్తానని కలెక్టర్లు రఘునందనరావు, వికారాబాద్ కలెక్టర్ దివ్యలు హామీ ఇచ్చారు. డిసెంబర్ 2017 నాటికి పైప్‌లైన్లు గ్రామాల వరకు తీసుకువెడితే శ్రీశైలంనుండి మంచినీటిని తెచ్చేందుకు అవకాశం ఉంటుందని మంత్రి అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లాలో కొత్తగా 14.66 కోట్ల వ్యయంతో చేపట్టిన పనులను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని కీసర, ఘట్‌కేసర్, కొండాపూర్‌లలో ఈ పనులు చేపట్టారని, 104 గ్రామాలకు మంచినీరు అందించే లక్ష్యం కాగా 86 గ్రామాలలో పనులు పూర్తి చేసినట్టు అధికారులు వివరించారు. ఈ పనులలో గోతులు తవ్వి వదిలేయడం, పనులను అర్ధంతరంగా నిలిపివేయడం సహించబోమని కలెక్టర్ ఎమ్.వి.రెడ్డి అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చూడాలని, ఏమైనా సమస్యలుంటే కలెక్టర్లతో చర్చించి పరిష్కరించుకోవాలని మంత్రి కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు రఘునందనరావు, దివ్య, ఎమ్.వి.రెడ్డిలతోపాటు ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యుఎస్, ఆర్‌అండ్‌బి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.