హైదరాబాద్

కౌన్సిల్‌లో సమస్యల ఏకరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 13: మహానగరంలోని కోటి మంది జనాభాకు అవసరమైన పౌరసేవలను అందించటంలో కీలక పాత్ర పోషించే జిహెచ్‌ఎంసి కార్యకలాపాలను, విధి విధానాలను ప్రభావితం చేసే కౌన్సిల్ సమావేశం గురువారం రొటీన్‌గా జరిగే సమావేశాల కన్నా భిన్నంగా జరిగింది. ఈ సారి మేయర్ రామ్మోహన్ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ సభ్యుల ప్రశ్నలకు అధికారుల నుంచి సమాధానం రాబట్టారు. ముఖ్యంగా కుక్కలు, కోతులు, దోమల బెడద మొదలుకుని ఎస్‌ఆర్‌డిపి పనులు, శానిటేషన్, ఇంజనీరింగ్ పనులు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, నాలాల పూడికతీత, ఆధునీకరణ పనులు వంటి అన్ని విభాగాలకు సంబంధించిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు. అధికార, విపక్షాలంటూ తేడా లేకుండా తమ డివిజన్లలోని సమస్యలను ఎకరువు పెట్టారు. అధికారుల సమాధానాలు సంతృప్తికరంగా లేకపోవటంతో సభ్యులు నిలదీసే ధోరణీలో మాట్లాడారు. అలాగే సభ్యులు ఎక్కువగా సమయాన్ని వృథా చేయకుండా తనదైన శైలిలో సమావేశాన్ని నిర్వహించారు. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన ఉదయం పదకొండున్నర గంటలకు ప్రారంభమైన ఈ సాధారణ సమావేశంలో తొలుత ప్రశ్నోత్తరాలు, పలు సమస్యలపై చర్చ, అజెండా ఆమోదం వంటి అంశాలతో సాయంత్రం దాదాపు ఆరు గంటల వరకు జరిగింది. తాజాగా వెలుగుచూసిన పూడికతీత పనుల్లోని అక్రమాల పట్ల కొందరు సభ్యులు ప్రశ్నించగా, ఈ వ్యవహారానికి సంబంధించి 23 మంది ఇంజనీర్లను బాధ్యులను చేసినట్లు కమిషనర్ కౌన్సిల్‌కు వివరించారు. మొత్తం 57 అంశాలతో కూడిన అజెండాతో పాటు టేబుల్ ఐటమ్‌గా తీసుకున్న మరో అయిదు అంశాలకు అనుకూలంగా, అలాగే ప్రతి ఏటా జిహెచ్‌ఎంసి ఖజానా నుంచి ఆర్టీసికి చెల్లిస్తున్న రూ. 271 కోట్లను చెల్లించే ఆర్థిక స్తోమత జిహెచ్‌ఎంసి లేదంటూ ప్రతికూల తీర్మానాలను కూడా చేశారు. సభ్యురాలు సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, గరిగంటి శ్రీదేవిలు శ్మశానవాటికల్లో వౌలిక వసతుల ఏర్పాటు, వాటి పరిరక్షణ అంశాన్ని ప్రస్తావించగా, వారితో పాటు మరికొందరు సభ్యులు కూడా అదే విషయాన్ని సభలో ప్రస్తావించారు. ఆ తర్వాత శానిటేషన్‌పై శ్రీదేవి, జ్యోత్స్న, హేమలతయాదవ్, విఠల్‌రెడ్డి, పద్మానాయక్, సలీంబేగ్, అరుణగౌడ్, బిజెపి సభ్యుడు శంకర్ యాదవ్‌లు పారిశుద్ద్య పనులు సక్రమంగా జరగటం లేదని, తమ ఏరియాల్లో కార్మికుల సంఖ్య తక్కువగా ఉందని, వెంటనే పెంచాలని, మరికొందరు తమ డివిజన్లకు ట్రైసైకిళ్లను కేటాయించాలని మేయర్ ద్వారా కమిషనర్‌ను కోరారు. వీరితో పాటు మజ్లిస్ సభ్యురాలు అయేషా రుబీనా, మహమూద్ హుస్సేన్, కె. అంజయ్య, పావనిరెడ్డి, అబ్దుల్ సమద్, రాజేందర్‌యాదవ్, టి?ఆర్‌ఎహ్ సభ్యులు కృష్ణ మాట్లాడారు. అలాగే నాలా పూడికతీత పనులు, వరద నీటి కాలువల విస్తరణ వంటి అంశాలపై టిఆర్‌ఎస్ సభ్యురాలు స్వర్ణలతారెడ్డి, నసీరుద్దిన్, సునరితారెడ్డి, సలీంబేగ్, కాంగ్రెస్ సభ్యురాలు శాంతి, హోర్డింగ్‌లు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, వాటి నుంచి వస్తున్న ఆదాయం, లెక్కల్లో పారదర్శకత వంటి అంశాలపై మాజీ మేయర్ మాజీద్ హుస్సేన్ మాట్లాడారు. ఎస్‌ఆర్‌డిపి పనులు, శివార్లలో జోరుగా సాగుతున్న గోదావరి పనుల సందర్భంగా రోడ్ల పునరుద్దరణ పనులు సక్రమంగా జరగటం లేదని మజ్లిస్ సభ్యులు మహమూద్ హుస్సేన్, కావ్యారెడ్డి తెలిపారు.
ఆమోదించిన ప్రతిపాదనల్లో కొన్ని
పివిఎన్ ఎక్స్‌ప్రెస్‌వే పిల్లర్ నెం.13 వద్ద సబ్‌వే, షేక్‌పేట సెవెన్ టూంబ్స్ వద్ద నిర్మించనున్న ఆరు లేన్ల ఫ్లై ఓవర్ ప్రతిపాదనలకు కూడా కౌన్సిల్ నేడు అధికారిక ఆమోద ముద్ర వేసింది. అలాగే జిహెచ్‌ఎంసి నిధులను ఆర్టీసికి చెల్లించటం పట్ల ఇప్పటికే మజ్లిస్ తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశంపై ప్రతికూల తీర్మానం చేశారు. అజెండాలోని మొత్తం 57 అంశాలతో పాటు టేబుల్ ఐటమ్‌గా తీసుకున్న మరో అయిదు ప్రతిపాదనలను కూడా కౌన్సిల్ సమావేశం ఆమోదించింది. వీటిలో ఎక్కువ శాతం స్ట్రాటెజికల్ రోడ్డు డెవలప్‌మెంట్ ప్లాన్(ఎస్‌ఆర్‌డిపి) పనులు, డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని ఇప్పటికే స్థారుూ సంఘం ఆమోదించినా, గురువారం నాడు కౌన్సిల్ కూడా ఆమోదించి ప్రభుత్వానికి పంపనున్నారు. ప్రతిపాదనల్లో ముఖ్యంగా ఎస్‌ఆర్‌డిపి పనుల సందర్భంగా పలు చోట్ల రోడ్డు విస్తరణలు, మరికొన్ని చోట్ల మల్టీలెవెల్ ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మంజూరు చేసిన 88వేల 55 డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రతిపాదనకు కౌన్సిల్ కూడా ఆమోదముద్ర వేయనుంది. వీటితో పాటు టేబుల్ ఐటమ్స్‌గా జిహెచ్‌ఎంసికి నిధుల సమీకరణ కోసం బాండ్లను స్వీకరించేందుకు అనుకూలంగా తీర్మానం చేస్తున్నట్లు మేయర్ తెలిపారు. దీంతో పాటు మల్కాజ్‌గిరి-సికిందరాబాద్ మధ్య నాలుగు లేన్ల ఫ్లై ఓవర్ వంతెన, తెలంగాణ హరితహారం కింద హెచ్‌ఎండిఏ నుంచి మొక్కల కోనుగోలు, ఎస్‌ఆర్‌డిపి పనుల్లో భాగంగా మైలార్‌దేవుపల్లి-్ఫలక్‌నుమాల మధ్య గ్రేడ్ సపరేటర్ వంటి ఇతర ఎస్‌ఆర్‌డిపి సంబంధిత పనులకు అనుకూలంగా తీర్మానం చేస్తున్నట్లు ప్రకటిస్తూ మేయర్ సభను ముగించారు.
సెల్ టవర్లపై మేమూ అయోమయంలోనే ఉన్నాం
కోర్టు ఆదేశాల మేరకు అనుమతులిస్తున్నాం: కమిషనర్
నగరంలో విచ్చలవిడగా సెల్‌ఫోన్ టవర్లు ఏర్పాటు చేస్తున్నారని, వీటి నుంచి విడుదలయ్యే రేడియేషన్ ప్రజారోగ్యానికి ముప్పుగా మారిందంటూ మజ్లిస్ సభ్యుడు సమద్ ప్రశ్నకు స్పందించిన కమిషనర్ జనార్దన్ రెడ్డి సమాధానం చెబుతూ సెల్ టవర్ల ఏర్పాటుకు సంబంధించి నాలుగైదేళ్ల క్రితం వరకు కూడా ఎలాంటి స్పష్టత లేదని, నేటికీ తామూ అయోమయంలోనే ఉన్నామన్నారు. సెల్‌టవర్ల ఏర్పాటును ఆపాలని తమకు రోజూ ఫిర్యాదులొస్తున్నా, కమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయాలని, ప్రతి ఒక్కరికి నిత్యం జీవితంలో సెల్‌ఫోన్లు ఎంతో ముఖ్యమైపోయాయని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న నేపథ్యంలో తాము ఏం చేయాలో తెలీక డైలమాలో ఉన్నామన్నారు. కానీ నామమాత్రపు ఛార్జీలు తీసుకుని అనుమతులివ్వాలన్న కోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామని తెలపగా, ఆయన సమాధానానికి సభ్యుడు సంతృప్తి చెందలేదు. అంతలో మేయర్ జోక్యం చేసుకుని సభ్యుడు కోరిన విధంగా కనీసం స్కూళ్లు, ఆసుపత్రులకు సమీపంలో సెల్ టవర్లను ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.