హైదరాబాద్

మనిషిని మనిషిగా గుర్తించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, బేగంపేట, ఏప్రిల్ 14: భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ బాటలో నడుస్తూ ఆయన కలలు కన్న కుల రహిత సమసమాజ స్థాపనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని రాష్ట్ర ఐటి, మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కె. తారకరామారావు అన్నారు. కులాలు, మతాలతో పని లేకుండా మనిషిని మనిషిగా గుర్తించే చక్కటి సమాజాన్ని నిర్మించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని సికిందరాబాద్ ఆదయ్యనగర్‌లో నిర్వహించిన వేడుకలకు ఆయన హజరయ్యారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్, పద్మారావులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత మంత్రి కెటిఆర్ స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కష్టాలను అడిగి తెల్సుకున్నారు. ముఖ్యంగా బోయిగూడలో 66, ఆదయ్యనగర్ 380, నల్లగుట్ట 661 ఇళ్లను, జంటనగరాల్లోని తొమ్మిది ప్రాంతాల్లోని 450 ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయాలని కోరగా, సానుకూలంగా స్పందించిన మంత్రి వారం రోజుల్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఉత్తర్వులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ,ఎస్టీల నుంచి మంచి మేధావులు, పారిశ్రామికవేత్తలను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం తెలంగాణ ఐపాస్, తెలంగాణ ప్రైడ్ కార్యక్రమాలను ఎంతో విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొందరు విద్యార్థినిలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం చెబుతూ అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేమని, విద్యార్థులు తమ నైపుణ్యతను పెంపొందించుకుని వివిధ రంగాల్లో రాణించాలన్నారు. కానీ ఇపుడు డిగ్రీ, ఎంబిఏ ఇతరాత్ర కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మున్ముందు పుష్కలంగా ఉద్యోగాలు అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. అంతేగాక, ఒంటరిగా జీవిస్తున్న మహిళలకు జూన్ 2వ తేదీ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు, అదే రోజు మే, జూన్ మాసాలకు చెందిన ఆర్థిక సహాయాన్ని వారికి అందజేయనున్నట్లు తెలిపారు. అలాగే సొంత ఇల్లు లేని పేదల కలను నిజం చేసేందుకు ఒక్క హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇస్తామని, లక్ష ఇళ్లు సరిపోవని, అవసరాలకు తగిన విధంగా నిధులను సమకూర్చుకుని ఇళ్లను నిర్మించి ఇస్తామన్నారు. నేడు దేశంలోని 28 రాష్ట్రాలు పేదలకు నిర్మించి ఇస్తున్న ఇళ్లకు ఎంత వెచ్చిస్తున్నారో, ఆ మొత్తం భారీ వ్యయం
రూ. 18వేల కోట్లతో ఈ ఇళ్లను మన ప్రభుత్వం నిర్మిస్తుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు ప్రజలపై పైసా భారం పడకుండా, రుణం గురించి బ్యాంకు చుట్టూ తిరగకుండా సుమారు రూ. 8.60 లక్షల వ్యయంతో ఒక్కో ఇళ్లును నిర్మిస్తున్నామని తెలిపారు. పేదింటి అమ్మాల పెళ్లికి కల్యాణ లక్ష్మీ, చదువుకునే పిల్లలుంటే వారి చదువు కోసం మెస్, కాస్మెటిక్ ఛార్జీలతో పాటు స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నామని, విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి అంబేద్కర్ ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్‌ల ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు చొప్పున మొత్తం 300 మంది విద్యార్థులకు అందజేసినట్లు మంత్రి వివరించారు. ఆ తర్వాత మంత్రి విద్యార్థులు, స్థానికులతో కలిసి భోజనం చేసి పలు ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు మల్లారెడ్డి, బల్కాసుమన్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, స్థానిక కార్పొరేటర్లు అత్తెలి అరుణగౌడ్, ఆకుల రూప, శేషుకుమార్, లక్ష్మీబాల్‌రెడ్డి, తరుణి, హేమలత తదితరులు పాల్గొన్నారు.

21న జాతీయ బిసి సమ్మేళనం
ముషీరాబాద్, ఏప్రిల్ 14: జాతీయ బిసి కమిషన్‌కు కేంద్రప్రభుత్వం చట్టబద్ధత కల్పించిన సందర్భంగా ఈనెల 21న సాయంత్రం నాంపల్లి తెలుగు లలిత కళాతోరణంలో జాతీయ బిసి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ తెలిపారు. శుక్రవారం కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్‌లను మర్యాదపూర్వకంగా కలిసారు. సమ్మేళనం వాల్‌పోస్టర్‌ను లక్ష్మణ్ ఆవిష్కరించారు. ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ మాట్లాడుతూ జాతీయ బిసి సమ్మేళనంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య, మంద కృష్ణమాదిగ, అఖిలపక్ష జాతీయ నాయకులను సత్కరించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బిసి సంఘాల నాయకులు నీలం వెంకటేష్, కె.నర్సింహాగౌడ్, నందగోపాల్, రావల్‌కోల్ నరేష్, వేముల రామకృష్ణ, పగిల్ల సతీష్, కృష్ణయాదవ్, సురేష్, రాజేందర్ పాల్గొన్నారు.