హైదరాబాద్

కళాకారులకు ప్రోత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: కళాకారులకు తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపుతోపాటు ప్రోత్సాహం లభిస్తోందని గిరిజన సాంస్కృతిక శాఖ మంత్రి చందూలాల్ అన్నారు. శనివారం సాయంత్రం తెలుగు విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో తెలంగాణ పర్యాటక శాఖ శృతిలయ మ్యూజిక్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శతగాత్ర స్వర సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి చందూలాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులను అభినందిస్తూ సాయి మనప్రగడ (సంగీతం), కాసర్ల శ్యామ్ (సాహిత్యం), ఇందిరా పరాశరం (కూచిపూడి నృత్యం)లకు శృతిలయ కళా పురస్కారాలను మంత్రి ప్రదానం చేసారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత ప్రభుత్వ ఉప కార్యదర్శి గుదిబండి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. తొలుత వందమంది చిన్నారులతో సంగీత కార్యక్రమం వీనుల విందుగా సాగింది.

తెలంగాణలో పద్యం సజీవం
హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సర్వేశ్వర ఆర్ట్ అకాడమీ శనివారం సాయంత్రం రవీంద్రభారతి ఘంటసాల ప్రాంగణంలో ‘పద్య తోరణం’ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గాయకులు ప్రియ, ప్రవీణ్ కుమార్, సాయి హారిక, నాగప్రియ, హరిప్రియ, శే్వత, బిందు, గణేశ్, పవన్‌కుమార్, పారిజాత తదితరులు పౌరాణిక నాటకాలలోని కొన్ని ఆణిముత్యాలవంటి పద్యాలను ఆలపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరుగున పడిన పద్యాన్ని వెలికితీసి ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రమణాచారి అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కె.ఎమ్.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.