హైదరాబాద్

జర భ ద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 15: ఏ విషయంలోనైనా ప్రమాదాలు జరిగి, సామాన్యులు ప్రాణాలు కోల్పోతే గానీ జిహెచ్‌ఎంసి అధికారులు కళ్లు తెరవరు. జరగాల్సిన ప్రాణ నష్టం జరిగిపోయిన తర్వాత మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు చేపడుతున్న ప్రమాద నివారణ చర్యలు మూన్నాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. కొద్దిరోజుల క్రితం తిరుమలగిరిలో రాత్రిపూట జిహెచ్‌ఎంసి టిప్పర్ ఢీ కొట్టడటంతో సికందరాబాద్ బన్సీలాల్‌పేటకు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు మృతి చెందిన సంఘటన తెలిసిందే! ఈ ఘటనపై ఆలస్యంగా స్పందించిన జిహెచ్‌ఎంసి అధికారులు నగరం నుంచి శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించే వాహనాల డ్రైవర్లకు రోడ్డు భద్రతపై శిక్షణనిచ్చేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో చెత్తను తరలించే వాహనాల్లో 15 ఏళ్లు నిండిన వాహనాలను స్క్రాప్ కింద తొలగిస్తున్నామని అధికారులు చెబుతున్నా, ప్రస్తుతమున్న వాహనాల్లో మంచి కండిషన్‌లో ఉన్నవి కూడా అంతంతమాత్రమే. అసలే డొక్కు బండ్లు..వాటికి లైటుంటే బ్రేక్‌లుండవు..బ్రేక్‌లుంటే లైట్లుండవు, ఈ రెండూ ఉంటే సరైన డ్రైవర్ ఉండడు. ప్రస్తుతం జిహెచ్‌ఎంసిలో వెయ్యి 19 మంది అడైవర్లున్నారు. వీరిలో 135 మంది డ్రైవర్లు అధికారుల వాహనాలు, లైట్ మోటారు వెహికిల్స్ నడుపుతున్నారు. మిగిలిన వారందరూ భారీ వాహనాల డ్రైవర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరందరికీ దశల వారీగా రోడ్డు భద్రత అంశాలు, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు, తాము చేసే చిన్న పొరపాటు ఇతరులు ప్రాణాల మీదకొస్తుందని, దాని వల్ల కలిగే నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరన్న అంశాలపై శిక్షణనిప్పించేందుకు సిద్దమయ్యారు. అలాగే హేవీ లైసెన్సులు కలిగిన వారిని మాత్రమే చెత్త వాహనాలు నడిపేందుకు అనుమతించాలని, లైసెన్సుల్లేని వారిని బయటకు పంపించాలని కూడా జిహెచ్‌ఎంసి యోచిస్తోంది. అంతేగాక, డ్రైవర్లు ఏ మాత్రమైనా మద్యం సేవించినట్లు అనుమానం వస్తే, వారిని విధులకు అనుమతించరాదని కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే డ్రైవర్లకు బ్రీత్ అనలైజర్ల ద్వారా కూడా డ్రైవర్లకు పరీక్షలు నిర్వహించేందుకు బల్దియా సిద్దమవుతోంది. మద్యపానం వల్ల కలిగే అనర్థాలపై పార్కింగ్ యార్డులు, ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల వద్ద డ్రైవర్లలో అవగాహన పెంపొందించేందుకు పలు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల ఇన్‌ఛార్జిలకు సూచించారు.
వాహనాల కండీషన్ సంగతేంటీ?
హేవీ డ్రైవింగ్ లైసెన్సులు ఉండాలని, విధులకు వెళ్లే ముందు డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిబంధన పెట్టారు. కానీ మద్యపానం ఏ మాత్రం అలవాటు లేకుండా, హేవీ వెహికల్ లైసెన్సు కల్గిన డ్రైవర్ సాఫీగా నడిపేందుకు వీలుగా వాహనాల కండీషన్‌ను మెరుగుపరిచే విషయంపై జిహెచ్‌ఎంసి అధికారులు దృష్టి సారించలేదు. చెత్త తరలింపు వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు కొన్ని సందర్భాల్లో వాహనాల కండీషన్ సక్రమంగా లేకపోవటం కూడా కారణమని చెప్పవచ్చు. ఈ క్రమంలో చక్కటి నైపుణ్యం కల్గి, మద్యం సేవించని డ్రైవర్లను విధులకు అనుమతించాలని భావిస్తున్న అధికారులు వాహనాలను కూడా అన్ని రకాలుగా కండీషన్‌లోకి తేవల్సి ఉంది. గతంలో ఈ వాహనాల మరమ్మతులో భారీ కుంభకోణాలు చోటుచేసుకోవటంతో ప్రస్తుతం ఆ బాధ్యతను వాహనాలను తయరు చేసిన కంపెనీల ఆధీకృత డీలర్లకు అప్పగించారు. చెత్త వాహనాలకు చిన్నపాటి మరమ్మతులు వచ్చినా, చాలా పార్కింగ్ యార్డుల్లో అక్కడ కేర్ టేకర్లు డీలర్లతో కుమ్మక్కై ఆ రిపేరును పెద్దగా చూపుతూ ఎక్కువ మొత్తంలో ఖరీదు చేసే విడి భాగాలను వేసినట్లు బిల్లును డ్రా చేస్తూ, నాసిరకం విడిభాగాలు భిగిస్తున్నట్లు కూడా ఆరోపణలున్నాయి.
పర్యవేక్షణ లోపమే కారణమా?
నగరం నుంచి శివార్లకు చెత్తను తరలించే వాహనాల మరమ్మతులను గతంలో ప్రధాన కార్యాలయంలోని సిటివో విభాగం పర్యవేక్షించేది. కానీ ఏడాది క్రితం కమిషనర్ ఈ వాహనాల మరమ్మతులను జోన్ల వారీగా వికేంద్రీకరించారు. అయితే ఈ జోన్‌కు ఆ జోన్ అధికారులు తమ పరిధిలోని వాహనాలకు కావల్సిన మరమ్మతులు చేసుకునేలా అధికార వికేంద్రీకరణ చేశారు. దీంతో కొందరు జోనల్, డిప్యూటీ కమిషనర్లు, జిహెచ్‌ఎంసి వాహనం బాగానే ఉన్నా, దాన్ని రిపేరున్నట్లు చూపుతూ , కాంట్రాక్టర్లతో కుమ్మక్కై దాని స్థానంలో చెత్తను తరలించేందుకు కమిషన్ల ప్రాతిపదికన అద్దె వాహనాల్ని ఎంగేజ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. అన్ని జోన్లలో వాహనాల రిపేర్లకు సంబంధించిన వ్యవహారాన్ని పర్యవేక్షించేందుకు ఓ ఉన్నతాధికారిని నియమిస్తే అనేక అక్రమాలు బయటపడుతాయన్న ఆరోపణలున్నాయి.