హైదరాబాద్

టిఆర్‌ఎస్‌కు సొంత బలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉమ్మడి రాజధాని మేయర్ పీఠంతో పాటు డిప్యూటీ మేయర్ స్థానం సైతం టిఆర్‌ఎస్ గెల్చుకోనుంది.
మేయర్ పీఠం కోసం 109 మంది కోరం అవసరముండగా, టిఆర్‌ఎస్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లుండగా, 36 మంది ఎక్స్ అఫిషియో సభ్యులను కలుపుకుంటే జిహెచ్‌ఎంసి కౌన్సిల్‌లో గులాబీ దళం బలం 135 మంది. వివిధ పార్టీలకు చెందిన ఎక్స్ ఆఫీషియో సభ్యుల్లో చేవెళ్ల ఎంపి కొండా విశే్వశ్వర్‌రెడ్డి రంగారెడ్డి గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకుని జిల్లా పరిషత్‌లో ఓటు ఆప్షన్ తీసుకున్నందున, తీగల కృష్ణారెడ్డి గ్రామపంచాయితీ పరిధిని ఎంచుకున్నందున వీరిద్దరు మేయర్ ఎన్నికకు దూరంగా ఉండే అవకాశముంది. ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండా టిఆర్‌ఎస్ పార్టీ తన సొంత బలంతోనే మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను దక్కించుకోనుంది. మొదటి నుంచి ఎక్స్ అఫిషియోల బలం అవసరమవుతుందన్న భావించిన అధికార పార్టీ ఎక్స్ అఫిషియోలకు జిహెచ్‌ఎంసి పాలక మండలిలో ఓటు కోసం ఇటీవలే ఆర్డినెన్స్‌ను కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే! మేయర్ ఎన్నికకు సంబంధించి జరిగే ఓటింగ్‌లో పాల్గొనే టిఆర్‌ఎస్‌కు చెందిన 99 మంది కార్పొరేటర్లతో పాటు ఓటింగ్ చేయనున్న 36 మంది ఎక్స్ ఆఫీషియో సభ్యుల వివరాలిలా ఉన్నాయి.
టిఆర్‌ఎస్‌కు ఉన్న మొత్తం ఎక్స్ ఆఫీషియో సభ్యులు-36 మంది
ఎంపిలు-2- రాజ్యసభ సభ్యుడు: కె.కేశవరావు, లోక్‌సభ సభ్యుడు: కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు-25- స్వామీగౌడ్, వి. భూపాల్‌రెడ్డి, సుంకరిరాజు, జనార్దన్‌రెడ్డి కాటేపల్లి, ఆర్. భూపతిరెడ్డి, పురాణం సతీష్‌కుమార్, కర్నె ప్రభాకర్‌రావు, మహ్మద్ సలీం, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, దర్పల్లి రాజేశ్వర్‌రావు, పూల రవీందర్, డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, ఉల్లోల్ల గంగాధర్‌గౌడ్, కసిరెడ్డి నారాయణరెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కొంపల్లి యాదవరెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి మమాదిరెడ్డి, నేతి విద్యాసాగర్, రాములునాయక్, పట్నం నరేందర్‌రెడ్డి, టి.్భనుప్రసాద్‌రావు, నారదాసు లక్ష్మణ్‌రావులతో పాటు కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన ఎం.ఎస్.ప్రభాకర్‌రావు వున్నారు.
ఎమ్మెల్యేలు- తలసాని శ్రీనివాసయాదవ్, టి.పద్మారావు, గూడెం మహిపాల్‌రెడ్డి, సిహెచ్. కనకారెడ్డి, మధవరం కృష్ణారావు, జి.సాయన్నలతో పాటు నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్, ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరిన వివేకానంద కూడా ఉన్నారు. టిడిపి-బిజెపిలకు 14 మంది.
రాజ్యసభ సభ్యులు: సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు
లోక్‌సభ సభ్యులు: బండారు దత్తాత్రేయ, సిహెచ్. మల్లారెడ్డి
ఎమ్మెల్యేలు: డా.కె.లక్ష్మణ్, జి. కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, టి. రాజాసింగ్, మాగంటి గోపీనాథ్, ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, ఆర్. కృష్ణయ్య, టి.ప్రకాశ్ గౌడ్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్సీ: ఎన్.రాంచంద్రరావు
కాంగ్రెస్: 8 మంది సభ్యులు -
రాజ్యసభ: కె.వి.పి, రామచంద్రారావు, వి.హనుమంతరావు, రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్థన్‌రెడ్డి, జయరాం రమేష్, ఎం.ఎ.ఖాన్, కె. చిరంజీవి, ఎమ్మెల్సీ: మహ్మద్ షబ్బీర్ అలీ
మజ్లిస్: 10 మంది సభ్యులు, లోక్‌సభ సభ్యుడు: అసదుద్దిన్ ఓవైసీ, ఎమ్మెల్యేలు: అక్బరుద్ధిన్ ఓవైసీ, జాఫర్ హుస్సేన్, కౌసర్ మోహియుద్దిన్, సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రి, ముంతాజ్ అహ్మద్‌ఖాన్, మహ్మద్ వౌజంఖాన్, అహ్మద్ బలాలా, ఎమ్మెల్సీలు: సయ్యద్ అల్తాప్ హైదర్ రజ్వీ, సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ